రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యాన్ని ప్రశంసించిన సీపీ సజ్జనార్

Publish Date:Apr 16, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది. ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా ధైర్య సాహసాలు ప్రదర్శించిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడిని సన్మానించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయనను ఆహ్వానించి శాలువా కప్పి నగదు బహుమతిని అందజేశారు. ఈ ఘటన ఈ నెల 14న అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్‌పేట్ ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద జరిగింది. 

బస్సు దిగుతున్న రాముడి మెడలోని బంగారు గొలుసును అపహరించేందుకు నిందితుడు అకస్మాత్తుగా ప్రయత్నించగా, తన వయసును కూడా లెక్కచేయ కుండా రాముడు  ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా నిందితుడిని గట్టిగా పట్టుకుని డయల్ 100కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అంబర్‌పేట్ పెట్రోల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు మల్లేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్  మన్నన్ గా గుర్తించారు.  

ఇతనిపై తెలంగాణ వ్యాప్తంగా 31 పాత కేసులు ఉన్నట్టు బయటపడింది. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉండగా, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.అతని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు., అతని అనుచరులు కోటేష్ మరియు మల్లేష్ పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ “సైనికుడు ఎప్పుడూ సైనికుడే” అన్న మాటను రాముడు తన కార్యాచరణతో నిజం చేశారని పేర్కొన్నారు. భయాన్ని జయించి నేరస్తుడిని ఎదిరించిన ఆయన ధైర్యం సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్‌లా వ్యవహరిస్తే నేరాలను నియంత్రించడం సులభమవు తుందని పిలుపునిచ్చారు.
 

By
en-us Political News

  
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్‌ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.