పరకాల కాంగ్రెస్‌కు పగ్గాల్లేవా?

Publish Date:Jun 25, 2012

Advertisement

కాంగ్రెస్‌పార్టీ పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలకు , నేతలకు  మద్య వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. వీరిని అదుపులో పెట్టడం పార్టీ నాయకత్వానికి పెద్ద సమస్యగా మారింది. అందుకే కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. కుర్చీలు విరిచేస్తారు. రోడ్డెక్కి వాహనాలు ఆపేసి ధర్నాలు చేసేస్తారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో  ఓటమి చవి చూసినా నేతలూ, కార్యకర్తల్లో మార్పు రాలేదేమిటీ అని పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు.

వరంగల్‌ జిల్లా పరకాల అసెంబ్లీకి ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పార్టీకి డిపాజిట్టు కూడా దక్కలేదు. అయినా సరే! అక్కడ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలూ, నేతలూ విర్రవీగుతూనే ఉన్నారు. ఈ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కోసం రూపొందించిన ఫ్లెక్సీలో గండ్రవెంకట రమణారెడ్డి ఫొటో చిన్నదిగా ఉన్నదంటూ ఆయన అనుచరులు రెచ్చిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో మంత్రులు, కొందరు నేతలూ వై.కా.పా.కు అమ్ముడుపోయారని కొందరు కార్యకర్తలు ఆరోపించారు. దీంతో సమావేశం రసాభాసగా మారింది. కుర్చీలు గాల్లోకి లేచాయి. ఓ రణరంగ వాతావరణం సృష్టించారు. సమావేశ మందిరం వద్ద విరిగిన కుర్చీలు కాంగ్రెస్‌ క్రమశిక్షణకు సాక్ష్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శల గురించి పట్టించుకోని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు ప్రధానరహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో ప్రజలు తీవ్ర అసహనం ప్రకటించారు. కాంగ్రెస్‌ నాయకులు ఇలా చేయడం వల్లే డిపాజిట్లు కూడా కోల్పోయారని ప్రజలు విమర్శిస్తున్నారు.

By
en-us Political News

  
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు
ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా వారిపై కన్ను వేసి ఉంచడం ఎంత ముఖ్యమో చెప్పడానికి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఒక హృదయవిదారక ఘటనే నిదర్శనం.
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.