అవినీతి మరిచిన ధర్మాన కమిటీ?

Publish Date:Jul 9, 2012

Advertisement

అసలు కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో విశ్వసనీయతే కొరవడి౦దని 2012 ఉప ఎన్నికలు నిరూపించాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీలో ఉన్న సీనియర్లు నమ్ముతున్నారు. కేవలం అవినీతి మంత్రులను ప్రోత్సహించటం, వారిని కాపాడేందుకు సిఎంతో సహా అందరూ ప్రయత్నించటం ఉప ఎన్నికల వైఫల్యానికి కారణమని ఓ పరిశీలనలో తేలింది. సీనియర్లు కూడా అవినీతి బాగా పెరిగిపోయిందని అథిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అసలు స్పందనే రాలేదు. పైగా అసలు వాస్తవాలు పరిశీలించి పార్టీని, ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపించేందుకు మంత్రి థర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అవినీతి ఛాయలకే పోలేదు. ఈ విషయమే చర్చించలేదు.

అవినీతి వల్లే సిబిఐ మంత్రులకు నోటీసులు ఇస్తోందని రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపువచ్చినా ఈ ఒక్క విషయాన్ని కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. అవినీతికి పాల్పడిన మంత్రులే పోతారనుకుని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మౌనం వహించటం కూడా ప్రజల్లో విశ్వసనీయతను దెబ్బతీసింది. గత అనుభవాల సారాంశం కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి అథికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగితే  కిలో బియ్యం రూ.1.90కు ఇస్తామని ప్రకటించారు. ఆయన మాటపై నమ్మకం లేక ఎన్టీఆర్‌కు కిలో రెండు రూపాయల బియ్యంకే పేదలు ఓట్లేసారు. ఈ ఘటన రాజకీయాల్లో తీవ్ర సంచలనమైంది. పేదల్లో ఉన్న విశ్వసనీయతను చాటుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ హయాంలో భూ పంపిణీలు సాగినందున దానిపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్‌ కాలక్షేపం చేస్తే ప్రజల్లో ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం తప్పదు. తాజాగా మంత్రివర్గ ఉపసంఘం మంత్రి తోట నర్సింహం ఇంట్లో సమావేశమైంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికీ, పార్టీకీ సమాచారం పంపిస్తోంది. అంతేకానీ పార్టీలో పేరుకుపోయిన అవినీతి గురించి మళ్లీ ప్రస్తావించటం మరిచింది. సహచర మంత్రులపై అభిమానంతో ఈ కమిటీ ఇలానే సమావేశమైతే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర అనుభవాలను చవి చూస్తుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
భద్రాచలంలో పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సద్ధుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు.
డ్రగ్స్‌ మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్‌ తెలిపారు.
 ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య రుతుపవనాల విస్తరణ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 
నగర శివారు ప్రాంతాల్లో సోషల్ మీడియా రీల్స్ వైరల్ క్రేజ్ కోసం యువత చేస్తున్న ప్రమాదకర విన్యోసాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.