పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట.. హబ్సిగూడలో ఉద్రిక్తత.!
Publish Date:Sep 3, 2026
Advertisement
కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమం హబ్సిగూడలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య చెలరేగిన ఘర్షణ తోపులాటకు దారి తీసింది. హబ్సిగూడ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ దిష్ఠిబొమ్మ దగ్ధానికి ప్రయత్నించారు. ఆ దశలో పోలీసులు అడ్డుకోవడంతో వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనతో హబ్సిగూడ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. [Congress agitation in Habsiguda, Rift, Police, Tense, Police Arrests]
http://www.teluguone.com/news/content/congress-agitation-in-habsiguda-24-230601.html





