ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కాక్రోచ్ జనతాపార్టీ డిమాండ్.. జూన్ 13 డెడ్ లైన్
Publish Date:Jun 11, 2026
Advertisement
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ను కాక్రోచ్ జనతాపార్టీ పునరుద్ఘాటించింది. అంతే కాకుండా ఆయన రాజీనామాకు ఈ నెల 13 డెడ్ లైన్ గా ప్రకటించింది. ధర్మేంద్ర ప్రదాన్ జూన్ 13లోగా రాజీనామా చేయకుంటే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరవధిక దీక్ష చేపడతామనీ, అలాగే దేశ వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామనీ హెచ్చరించింది. ఈ మేరకు కాక్రోచ్ జనతాపార్టీ విడుదల చేసిన ఒక ప్రకనటలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దేశ యువత అంటే జన్ జీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడటం లేదని పేర్కొంది. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ తో గురువారం (జూన్ 11) పూణేలో ఆందోళన చేపట్టింది. ఆ తరువాత లక్నో, అమృత్‌సర్, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్‌లో కూడా ఆందోళనలు నిర్వహిస్తామనీ, ఈ నెల 13లోగా కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోతే జూన్ 20న జంతర్ మంతర్ వద్ద నిరవధిక ధర్నా చేపడతామని పేర్కొంది. దేశ విద్యా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి, సంస్థాగత వైఫల్యానికి ఏ విద్యార్థి కూడా మూల్యం చెల్లించకుండా చూసేందుకే ఈ ఉద్యమం చేపట్టినట్లు కాక్రోచ్ జనతాపార్టీ పేర్కొంది. జవాబుదారీతనం, న్యాయం కోసం జరిగే పోరాటంలో పాలు పంచుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలకు పిలుపునిచ్చింది. ఇలా ఉండగా గురువారం (జూన్ 11) పుణెలో జరిగిన నిరసనలో కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ పాల్గొన్నారు.
http://www.teluguone.com/news/content/cockroach-janata-party-demands-dharmendra-pradhans-resignation-36-222550.html





