ఆగస్టులో కిరణ్‌ కుమార్‌కు పదవీ గండం ?

Publish Date:Jul 13, 2012

Advertisement

 ఆగస్టు నెల అంటేనే రాజకీయనాయకులు బంబేలెత్తుతారు. ఎందుకంటె ఈ నెల  రాజకీయ సంక్షోభాలకు మారుపేరు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆగస్టు ఆయన్ని  ముప్పతిప్పలు పెట్టింది. ఎన్టీరామారావును   నాదేళ్ల భాస్కరరావునుండి వెన్నుపోటు పొడిచారు. సంవత్సరం తర్వాత  చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ను గద్దె దింపి పార్టీని తన హస్తగతం చేసుకోవడం  కూడా ఈ నెలలోనే జరిగింది. మరి వచ్చే ఆగస్టు ఎలావుండ బోతోందో కొంచెం తెలుసుకుందాం.


ఈ ఆగస్టు 8 నుండి 18 వరకు రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటాయని  జ్యోతిశాస్త్రపండితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి మారతారని కూడా ఘంటాపథంగా చెబుతున్నారు. కిరణ్‌కుమార్‌కు గత సంవత్సరం శని ఉచ్చదశలో ఉన్నందున ఏవరూ ఊహించని విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారని, ఈ సంవత్సరం కిరణ్‌కుమార్‌ జాతకంలో శని వక్రదశలో కన్యను చూడటం వల్ల ఆయనకు పదవీ గండం తప్పదని ఆయనకు ఆగస్టు అంతా క్షణం ఒక యుగంలా గడుస్తుందని కూడా చెబుతున్నారు.



అలాగే ఆగస్టు 15న, కుజ శని కలయిక వల్ల కూడా రాష్ట్రరాజకీయాలలో పెను మార్పులు ఉంటాయన్నారు. అయితే ఈ మార్పులన్నీ  రాష్ట్రానికి మంచిదే అని కూడా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడతూ, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే వారికి గుడ్‌ లక్‌ చెప్పడం విశేషం. గతంలో రోశయ్య కూడా రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు విలేఖరులడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘‘నన్నేం చేయమంటారు . పదవికి రాజీనామా చేయంటారా?‘‘ అని ఆగ్రహంతో అన్నారు. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారో ఏమోగాని కొద్ది రోజులకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కిరణ్‌ కుమార్‌ తన పదవిపై కన్నేసిన వారికి గుడ్‌ లక్‌ చెప్పడం విశేషం.

By
en-us Political News

  
ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ కీలకమైన టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ యూనివర్సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా క్రీడలు యువతలో ఉత్సాహాన్ని నింపుతాయని ప్రధాని రేవంత్ తో అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా  ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే మాజీ సీబీఐ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు, సజ్జనార్‌పై  బహిరంగంగా పలు ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు చేశారనీ,   పోలీసు యూనిఫాం వెనుక దాక్కున్న నేరస్థుడిగా ఆయన సజ్జనార్ ను అభివర్ణించారనీ తన లేఖలో పేర్కొన్న రాజాసింగ్, అటువంటి ఆరోపణలను ఎదుర్కొంటున్న సజ్జనార్ పై చర్యలు తీసుకోకుండా కేవలం బదలీతో సరిపెట్టడమేంటని నిలదీశారు.
అక్వాన్ ప్రభావం ప్రధానంగా తెలంగాణలోని తూర్పు దక్షిణ జిల్లాలపై అధికంగా ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకూ అక్వాన్ ప్రభావంతో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.