నాటి యువగళం హామీ..నేడు నెరవేరింది.!

Publish Date:Oct 2, 2026

Advertisement

నేడు మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు  శ్రీకారం.!

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరే ఇతర నాయకుడు చేయని విధంగా యువనేత నారా లోకేష్ రాయలసీమలో 124 రోజులు, 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1,587 కి.మీ మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. అ సమయంలో లక్షలాది మంది రాయలసీమ రైతులను నేరుగా కలిసి, వారు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. కష్టాలు చూశాను... కన్నీళ్లు తుడుస్తానని ఆనాడు సీమ రైతాంగానికి భరోసా ఇచ్చారు. పాదయాత్ర 119వ రోజున 2023 జూన్ 7న  కడప వేదికగా మిషన్ రాయలసీమను ప్రకటించారు. హార్టీకల్చర్ హబ్ గా రాయలసీమను మారుస్తామని, సీమ సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని చెప్పారు. మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీనీ, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సాహం కల్పిస్తామని, 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తామని తెలిపారు. దేశానికి, అంతర్జాతీయ స్థాయిలో ఎక్స్ పోర్టు చేసే విధంగా కొత్తరకం విత్తనాలు, మొక్కలు సృష్టించేందుకు హార్టికల్చర్ రీసెర్చి సెంటర్ ఏర్పాటు చేస్తానని ఆనాడు ప్రకటించారు. సీడ్ హబ్ గా ఏపీని మార్చడం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్, పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని నాడు రైతులకు హామీ ఇచ్చారు.  

యువగళం పాదయాత్ర సందర్భంగా ఆనాడు రాయలసీమ రైతాంగానికి యువనేత లోకేష్ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఈరోజు సాకారం చేసింది. ఉమ్మడి ప్రకాశం సహా రాయలసీమలో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌-GHHకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అభివృద్ధి కోసం రాబోయే మూడేళ్లలో ప్రభుత్వం రూ.40,352 కోట్లు వెచ్చిస్తుంది. ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్లు పెట్టుబడులు రాబట్టేలా ప్రణాళికలు రూపొందించారు. సీడ్ టు షిప్ మెంట్ విధానంలో ఉద్యాన రైతులకు అండగా నిలిచేలా ప్రతిష్టాత్మక GHH కు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా ఉద్యాన రైతులకు మేలు కలిగేలా  పెద్ద ఎత్తున సాగునీరు, డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వం చేపడుతుంది. రహదారులు, లాజిస్టిక్స్ అభివృద్ధి పనులకూ GHHలో ప్రాధాన్యత ఇస్తారు. 

వ్యవసాయ, ఉద్యాన, ఆర్థిక, ఇరిగేషన్ సహా వివిధ కీలక శాఖలతో వరుస సమీక్షలపాటు ముఖ్యమంత్రి కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. రాయలసీమ పరిస్థితులను అర్థం చేసుకుని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు నిధులు సమకూర్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీనిద్వారా ఉద్యాన సాగు విస్తరణ, పంట దిగుబడి మొదలుకుని ఎగుమతుల వరకు జరిగే వివిధ ప్రక్రియలను బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ దేశానికే కాక ప్రపంచానికే "ఫ్రూట్ బౌల్" గా మారుతుంది. ఉద్యానవన రంగం రైతుల ఆదాయాన్ని పెంచడం, గ్రామీణ ఉపాధిని సృష్టించడం, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించడంలో కీలక చోదక శక్తిగా నిలుస్తుంది. ఒకప్పుడు కరువుకు పర్యాయపదంగా ఉన్న రాయలసీమ, మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, స్వీట్ ఆరెంజ్, అవకాడో, ఆపిల్, బెర్రీస్ వంటి ఉద్యాన పంటలలో దేశంలోనే అగ్రగామిగా నిలవబోతుంది.

By
en-us Political News

  
నిజాంపట్నం, వాడరేవులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నంలో 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అలాగే కృష్ణపట్నంలో 8వ నంబర్, విశాఖ ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతిలో  తనను కలిసిన కేంద్ర బృందంతో సమావేశంలో  తుఫాను వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్రంగా చర్చించారు. రాష్ట్రం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను కేంద్ర బృందానికి వివరించిన చంద్రబాబు, త్వరితగతిన కేంద్రం నుంచి తగిన ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకోవాలని కోరారు.
టీటీడీ పాలకమండలి స్థానంలో కొత్త పాలక మండలి ఏర్పాటు అయ్యేంత వరకూ   టీటీడీ సమగ్ర నిర్వహణ బాధ్యతలను  ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్రత్యేక  కమిటీ (స్పెసిఫైడ్ అథారిటీ) ని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన మురసు తుపాను వేగంగా కదులుతూ తీరం వైపు దూసుకొస్తోందన్నవాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చంద్రబాబు అధికారులకు, పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు.  
స్వర్గస్థులైన బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి పూలమాలలు వేసి అశ్రునయనాలతో ఘన నివాళు లర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బాధితురాలి ఆరోగ్యం కుదుటపడుతోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.  పాఠశాల ప్రాంగణంలో ఓ దుండగుడు జరిపిన పాశవిక దాడిలో  తీవ్రంగా గాయపడిన  బాలిక చికిత్సకు స్పందిస్తున్నదనీ, ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లేనని వైద్యులను ఉటంకిస్తూ నారా లోకేష్ తెలిపారు.  
పరారీలో ఉన్న నిందితుడిని గాలిస్తుండగా పోలీసులకు సదరు నిందితుడు ఎదురుపడ్డాడు. పోలీసులు లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ నిందితుడు పట్టించుకోలేదు సరికదా పోలీసులపై ఎదురు తిరిగాడు. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఆత్మసంరక్షణార్థంపోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు.  
తుపాను తీరం దాటే సమయంలో . తీరం దాటే సమయంలో గంటకు   110 కిలోమీటర్లకు పైబడిన వేగంతో  వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.  ఈ తుపాను ప్రభావం  దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాపై తీవ్రంగా ఉ:టుంది. తుపాను కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో అమానుష దాడికి గురై తీవ్రంగా గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ వైద్యులను కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండం
పులివెందుల మున్సిపల్‌ ఎన్నికల వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని పాఠశాలలో మైనర్ విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
Nandamuri Balakrishna, Balakrishna Voting, Hindupur MLA, AP Municipal Elections, Andhra Pradesh Politics, Balakrishna Political Comments, Public Welfare, Local Body Elections, Voting Rights, TDP, Hindupur Elections, AP Election News
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.