సీఎం చంద్రబాబైనా సరే.. అంతేగా.. అంతేగా!

Publish Date:Jun 20, 2026

Advertisement

ఎంతటి వారైనా సరే ఇంట్లో భార్య మాట వినాల్సిందే.  ఆ విషయంలో సీఎం అయినా సరే.. అంతేగా, అంతేగా అనాల్సిందే. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా చెప్పారు.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  తన  పల్నాడు జిల్లా పర్యటనలో   ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు. ఈ సంఘటన అక్కడున్న వారందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.   

విషయమేంటంటే.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ  కార్యక్రమంలో భాగంగా   చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని లింగంగుంట్లలో  శనివారం (జూన్ 20) పర్యటించారు. అక్కడ ఓ రైతు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్నిసందర్శించిన సందర్భంగా ఆ రైతు  తన స్వంత గానుగ ద్వారా రసాయనరహితంగా తయారు చేస్తున్న ఆర్గానిక్ వేరుశనగ నూనె విశేషాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఆ నూనెను ఒకసారి వాడి చూడాలని రైతు కోరడంతో చంద్రబాబు  సరే అంటూ.. తన జేబులోంచి ఫోన్ తీసి భార్య భువనేశ్వరికి కాల్ చేసి పర్మిషన్ తీసుకున్నారు. .

ఆ తరువాత.. అక్కడున్న వారితో.. ఇంట్లోకి ఏ వస్తువు కొనాలన్నా ముందు భార్య పర్మిషన్ తీసుకోవాలి కదా.. అని వ్యాఖ్యానించారు.  తన సతీమణి భువనేశ్వరితో  ఫోన్ లో  మాట్లాడి, ఆమె అనుమతి తీసుకున్న తర్వాతే చంద్రబాబు ఒక లీటరు కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనె బాటిల్‌ను కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ గృహ విషయాల్లో భార్య అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వడం చూసి అక్కడి రైతులు, అధికారులు ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. 

ఇక రైతు   నాగభూషణం.. తాను  గత నాలుగేళ్లుగా ఎలాంటి రసాయన ఎరువులు లేకుండా కేవలం ప్రకృతి సేద్యం చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి నాణ్యమైన దిగుబడి వస్తోందన్నారు.  వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు. దీనిపై ఆ రైతును   ముఖ్యమంత్రి అభినందించారు.  ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు అక్కడి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని కూడా   పరిశీలించారు. పంటలకు అవసరమైన జీవామృతం, ఘన జీవామృతం వంటి సహజసిద్ధ ఎరువులను ఎలా సిద్ధం చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే క్షేత్రంలో సాగవుతున్న బొప్పాయి తోటను సందర్శించి సహజసిద్ధమైన బొప్పాయి పండును రుచి చూశారు. రాష్ట్రవ్యాప్తంగా రసాయన రహిత వ్యవసాయాన్ని, ప్రకృతి సాగు పద్ధతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు.  

By
en-us Political News

  
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్‌ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.