పార్టీ పెద్దలపై విరుచుకుపడ్డ డికె అరుణ

Publish Date:Mar 24, 2012

Advertisement

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలపై మంత్రి డికె అరుణ మండిపడ్డారు. సిఎల్పి కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీ పెద్దల విమర్శల వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సీనియర్లు చేస్తున్న విమర్శలు పార్టీని బలహీనపరిచే విధంగా ఉన్నాయని, పార్టీ పట్ల విశ్వాసాన్ని పెంచే విధంగా వ్యహరించాలి తప్ప పరస్పరం విమర్శలు చేసుకుంటూ బలహీనపరిచే పని చేయడం సరి కాదని ఆమె అన్నారు. సీనియర్ నేతలు ప్రచారానికి కూడా రాకుండా ఫలితాలు వచ్చిన తర్వాత విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు.

విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి విడుదల చేసిన సర్వే ఫలితాలపైనా ఆమె తీవ్ర వ్యాఖ్యలు  చేశారు. ఉప ఎన్నికలపై సర్వే రిపోర్టులు ప్రకటించారు, క్రమశిక్షణ ఎవరిని చూసి నేర్చుకోవాలని ఆమె లగడపాటి రాజగోపాల్‌ను ఉద్దేశించి అన్నారు.  తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ని విశ్వసించలేదని చెప్పారు. ప్రజల కోసం ప్రభుత్వం పని చేస్తుందని తెలియజెప్పవలసిన అవసరం ఉందన్నారు. పార్టీని రోడ్డుమీద వేయకుండా మళ్లీ వచ్చే ఉప ఎన్నికలలో అందరూ కలిసి కృషి చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

పార్టీ పార్లమెంటు సభ్యులు, సీనియర్లు తెలంగాణ తెచ్చేది ఇచ్చేది తామేనని చెప్పి ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించాల్సి ఉండిందని ఆమె అన్నారు. తెలంగాణ ఎంత ముఖ్యమో పార్టీ కూడా అంతే ముఖ్యమని ఆమె అన్నారు. తాము ఎన్నికల్లో కష్టపడుతుంటే సీనియర్లు కాంగ్రెసు ఓడిపోతుందని ప్రకటనలు చేశారని ఆమె తప్పు పట్టారు. కాంగ్రెసులో ఉంటూ వేరే పార్టీకి మద్దతుగా మాట్లాడారని ఆమె విమర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెసుకు 43 వేల ఓట్లు రావడం చిన్న విషయమేమీ కాదని ఆమె అన్నారు. గత ఎన్నికల్లో కన్నా ప్రస్తుతం తెరాస తరఫున పోటీ చేసిన జూపల్లి కృష్ణా రావుకు 375 ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయని ఆమె చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా వారిని మభ్య పెట్టి తెలంగాణవాదంతో గెలవాలనే స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ఆశించినవారి వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయని ఆమె అన్నారు.

By
en-us Political News

  
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచేలా నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది.
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ భూముల వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
తెలంగాణలో కొత్త చేయూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.
ఇక శుక్రవారం ఉదయం   6 గంటలకు స్వామివారి విగ్రహాన్ని భారీ ట్రక్కుపైకి ఎక్కించి, మధ్యాహ్నం 12 గంటల కల్లా శోభాయాత్రను ముగించి నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. 
ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల చేతికి చిక్కిన ఘటనలు వెలుగులోకి వస్తున్నా.. కొంతమంది అధికారులు మాత్రం తళుకు బెళుకు లేకుండా రహస్యంగా లంచం
పట్టణ ప్రజలకు అత్యుత్తమ పౌర సేవలను అందించడంతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం  ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన..   నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం  వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని వివరించారు.
ఎంజీఎం ఆస్పత్రి వద్ద రణరంగం.. రోడ్డుపై బైఠాయించి బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే..!
 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెడుతున్న వ్యవహారాలపై ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను స్వీకరించి, వాటిని  రికార్డు చేస్తున్నారు. ఈ బాధ్యతలను పర్యవేక్షించేందుకు పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్‌రావుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
గత రెండు దశాబ్దాలుగా నిమ్స్ ఆసుపత్రిలో వివిధ హోదాల్లో వైద్యుడిగా సేవలందిస్తున్నారు. అంతేకాకుండా గత ఐదేళ్లుగా నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
భాగ్యనగరంలో శాంతిభద్రతలపై నగర ప్రజల ఆందోళన..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.