పట్టు సాధించిన కిరణ్..కేబినెట్ లోకి మరో ముగ్గురు

Publish Date:Feb 6, 2012

Advertisement

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోకి కొత్తగా మరో ముగ్గురు మంత్రులు వచ్చి చేరారు. దీంతో  రాష్ట్ర కేబినెట్‌లో మరో ముగ్గురికి స్థానం లభించింది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఇద్దరిని ఇంతకు ముందు మంత్రి వర్గంలోకి తీసుకున్న కిరణ్ ఇప్పుడు ముగ్గురిని మంత్రులుగా చేర్చుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రంగా రెడ్డి జిల్లాకు చెందిన ప్రసాద్ కుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొండ్రు మురళిలు మంత్రులుగా నియమితులయ్యారు. ఊహించని విధంగా వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. కొత్తగా నియమితులైన మంత్రులతో గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా అవకాశం దొరికిన వారిలో ఇద్దరు ఎస్సీలు, ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమానికి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, ఆరోగ్యశాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి హాజరుకాలేదు. సబితా, డిఎల్ అసంతృప్తితోనే కార్యక్రమానికి హాజరుకాలేదని తెలుస్తోంది. ఇంతకు ముందు రాజీనామా చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి, జూపల్లి కృష్ణారావు స్థానంలో కొండ్రు మురళికి స్థానం కల్పించారు. బర్తరఫ్ అయిన పి. శంకరరావు స్థానంలో ప్రసాద్ కుమార్‌కు ఆయన మంత్రి వర్గంలో చోటు కల్పించారు.

కాగా, కొత్త మంత్రుల ఎంపికతోపాటు వారికి శాఖల కేటాయింపులోనూ సీఎం కిరణ్ తనదైన శైలిలో 'బ్యాటింగ్' చేశారు. తనకు నచ్చిన వారికి పదవులు ఇస్తూనే... నచ్చని వారి శాఖల్లో కోత కోశారు. 'ఒక్క బంతికి రెండు సిక్సర్లు' కొట్టారు. డీఎల్ రవీంద్రా రెడ్డి నుంచి వైద్య విద్య, 108, 104 సర్వీసులను తప్పించి వాటిని తనకు సన్నిహితుడైన కోండ్రు మురళికి అప్పగించారు. 108 సేవలు నిర్వహిస్తున్న జీవీకేపై డీఎల్ బహిరంగ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీవీ కృష్ణారెడ్డి సీఎంకు సన్నిహితుడు. దీంతో డీఎల్ విమర్శలు పరోక్షంగా ముఖ్యమంత్రినే తాకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను వైద్య ఆరోగ్య శాఖకు మాత్రమే పరిమితం చేయడం గమనార్హం. 'ఇది పొమ్మనకుండా పొగబెట్టడమే' అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కిరణ్‌కు పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఉన్నత విద్యాశాఖతోపాటు వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వ్యవసాయశాఖను కూడా రాజనర్సింహ నిర్వహిస్తున్నారు.'డిప్యూటీ' హోదాలో తనకు హోంశాఖ కట్టబెట్టాలన్నది రాజ నర్సింహ అభిప్రాయం. ఆయన కోరుకున్నది జరగకపోగా, ఉన్న శాఖల్లోనే ఒకటి ఊడిపోయింది. రాజ నర్సింహ నుంచి వ్యవసాయాన్ని తప్పించి దానిని కన్నా లక్ష్మీనారాయణకు అప్పగించారు. కన్నా చేతిలోని గృహనిర్మాణ శాఖను కొత్త మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. శంకర్‌రావు రాజీనామాతో ఖాళీ అయిన చేనేత, జౌళి శాఖను ప్రసాద్ కుమార్‌కు అప్పగించారు. మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపుల ద్వారా సీఎం కిరణ్ 'నేను బలహీనుడిని కాను' అనే సంకేతాలను పంపారు.


సైన్యంలో కెప్టెన్‌గా ఎంత క్రమశిక్షణగా పనిచేశానో మంత్రిగా అంతే క్రమశిక్షణతో పనిచేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటన్నారు. తెలంగాణకు ప్రాధాన్యం ఇవ్వలేదని అంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పుడు ఇస్తే ఎందుకు విమర్శిస్తోందని ఆయన అడిగారు. ఏ శాఖ అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని ఆయన అన్నారు. తనకు మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు కొండ్రు మురళి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా ప్రమాణం చేయడానికి ముందుకు విప్ పదవికి కొండ్రు మురళి రాజీనామా చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వైద్య విద్యను, ప్రసాద్ కుమార్‌కు చేనేత జౌళి శాఖను, కొండ్రు మురళికి ఆర్‌డబ్ల్యుఎస్ శాఖను కేటాయించారు. కొత్తగా ముగ్గురు చేరడం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కోస్తాంధ్రకు చెందినవారు 17 మందికి ప్రాతినిధ్యం లభించింది. కొండ్రు మురళి చేరికతో ఈ సంఖ్య 16 నుంచి 17కు పెరిగింది. తెలంగాణకు కూడా అంతే ప్రాతినిధ్యం ఏర్పడింది. ఇంతకు ముందు 13 మంది మంత్రులు ఉండగా, ఆ సంఖ్య ఇద్దరి చేరికతో 15కు పెరిగింది. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రితో కలిపి 9 మంది ఉన్నారు.

By
en-us Political News

  
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
తాజాగా వెలువడిన ఆర్థిక ఫలితాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెట్రో సంస్థ భారీ మొత్తంలో లోటును చవిచూడాల్సి వచ్చింది. ప్రయాణాల ద్వారా వచ్చే ఆదాయం కంటే, రోజువారీ నిర్వహణ, ఫైనాన్స్ ఖర్చులే అధికంగా ఉండటంతో  లోటు 405 కోట్ల రూపాయలు దాటేసింది. 
తీరొక్క పూలతో కళకళలాడుతున్న మార్కెట్లు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.