కిరణ్ మంత్రి వర్గ విస్తరణపై అసమ్మతి సెగలు
Publish Date:Feb 6, 2012
Advertisement
హైదరాబాద్: మంత్రి పదవులు దక్కని సీనియర్ కాంగ్రెసు శానససభ్యులు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తలపెట్టిన మంత్రి వర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాహాటంగానే వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ శానససభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు కల్పిస్తూ తనను విస్మరించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దామోదర్ రెడ్డి సోదరుడు రాంరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రి వర్గంలో ఉన్నారు. దీంతో సోదరులిద్దరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, గుంటూరు జిల్లాకు చెందిన గాదె వెంకటరెడ్డి కూడా మంత్రి పదవి దక్కనందుకు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు బంధువైన డిఎల్ రవీంద్రా రెడ్డికి మంత్రి పదవి కల్పించినందున తనకు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతుండడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/cm-24-11645.html





