కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్న చిరంజీవి

Publish Date:Jun 23, 2012

Advertisement

రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్‌ చిరంజీవి తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నారా? పీఆర్పీ అధినేతగా సాధించలేనిది కాంగ్రెస్‌లో ఉంటే కలిసివస్తుందంటూ తానే ఢల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎప్పుడో వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆహ్వానం పలికితే చాలా ఆలస్యంగా స్పందించిన చిరంజీవిని ఒకరకంగా కాంగ్రెస్‌ పార్టీ అక్కున చేర్చుకుంది. అందుకే రాజ్యసభ సభ్యత్వం కూడా ఆయనకు ఇచ్చింది. 2014 నాటికి ఏ నాయకుడూ కలిసి రాకపోతే చిరంజీవిని కాంగ్రెస్‌ పార్టీ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంటుందని సోనియాగాంధీ భావించారు. అసలే ఉప ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా లేవని, రాష్ట్రపతి ఎన్నికలు కూడా ముంచుకొచ్చాయన్న ఆందోళనలో హడావుడిగా ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానంపై చిరు చేసిన వ్యాఖ్యానాలు ఘాటుగా ఉన్నాయి. 2014 ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నాయకులు ఆశలు వదులేసుకున్నారని చిరు విమర్శించారు.

 

 

రామచంద్రపురం కాంగ్రెస్‌ కార్యకర్తలతో చిరు అవసరం లేని ప్రేలాపన పేలినట్లు అయింది. కాంగ్రెస్‌లో పీఆర్పీని కలిపేశాక ఇక విడిగా పీఆర్పీ ఎక్కడ ఉంది? అని తనను తాను ప్రశ్నించుకోకుండానే చిరు తొందరపడ్డారు. పైగా, రామచంద్రపురంలో మంత్రి తోట నర్సింహం, ఎంపి జివి హర్షకుమార్‌ తదితరులు ముందుండి మరీ త్రిమూర్తులు విజయానికి కృషి చేస్తే కాంగ్రెస్‌ను అవమానించటం చిరంజీవికే చెల్లింది. దీనికి తోడు అసలు నెగ్గటానికి అవకాశం లేని స్థితిలో తోట నర్సింహం ఒకవైపు కులసమీకరణలు చేస్తూనే తెలుగుదేశం ఓటుబ్యాంకును తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇక హర్షకుమార్‌ అయితే తన సామాజిక వర్గ నేతలు (ఎస్సీలు) తోట విజయానికి ప్రధానపాత్రధారులు కావాలని నిజాయితీగానే కోరారు. వీరిద్దరూ ఒకరకంగా నియోజకవర్గంలో రాజకీయాలను పెద్దమలుపు తిప్పటమే కాకుండా కమ్మసామాజిక వర్గాన్ని, శెట్టిబలిజ సామాజికవర్గంలో ప్రతినిధులను ఆకర్షించటంలో సఫలమవడంతో  తోట విజయం సాధ్యమైంది. అసలు చిరంజీవి రానక్కర్లేదని తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించేంత బలంగా కాంగ్రెస్‌ పని చేసింది. ఇక  తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో చిరంజీవి పీఆర్పీ కార్యకర్తలతో సమావేశం కాకపోవటం, స్థానికంగా కొందరు పి.ఆర్‌.పి.నేతలు కాంగ్రెస్‌ అభ్యర్దిని వ్యతిరేకించటమే ఆ పార్టీ అభ్యర్ది ఓటమికి కారణమని తేలింది. అంటే తిరుపతి ఓటమికి చిరంజీవే ప్రధానకారణమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అసలు తప్పు తన కింద పెట్టుకుని చిరు పీఆర్పీని ఆదరించటం లేదని కాంగ్రెస్‌పై రుసరుసలాడటం ఒకరకంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్లస్‌ అయ్యే అవకాశం ఉంది.

By
en-us Political News

  
 హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన కౌకూర్ ఆర్చిడ్ విల్లాలో ఐదేళ్ల చిన్నారి ఆరిలియా హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
హైదరాబాద్ నగరంలో క్రిప్టోకరెన్సీ లావాదేవీల నేపథ్యంలో తీవ్ర కలకలం రేపిన భారీ దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐదున్నర ఎకరాల స్థలం తమదేనంటూ ఓ వ్యక్తి, అతని కుమారుడు వచ్చి.. సి. రామచంద్రయ్య నుంచి అడ్వాన్స్ గా పాతిక లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత పత్రాలు చూపించకుండా తప్పించుకున్నారు. సి.రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు  ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశానికి నిజంగా స్వరాజ్యం సిద్ధించిందా? అంటే అనుమానమే అనే సమాధానం వచ్చేలా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్న పెత్తందారీ వ్యవస్థ కారణంగా.  పేరుకే ప్రజాస్వామ్యం కానీ   చోట్ల అభివృద్ధి, సామాజిక ఐక్యత పేరుతో  కొన్ని ప్రాంతాలలో అనధికార కమిటీలు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నాయి. 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.