చిరంజీవికి రాజ్యసభ, సురేఖకు తిరుపతి?

Publish Date:Mar 10, 2012

Advertisement

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాష్ట్ర రాజకీయాలు రోతపుట్టిస్తున్నాయి. అందుకే ఆయన జాతీయస్థాయి రాజకీయాలపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఆయన రాజ్యసభ టిక్కెట్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని కోరినట్లు తెలిసింది. పిఆర్పీ సంఖ్యాబలంతో ఇటీవల ప్రభుత్వాన్ని కాపాడుకున్న కిరణ్ కూడా చిరు కోర్కెను మద్దతు ఇచ్చినట్లు తెలిసింది. తనకు రాజ్యసభ టిక్కెట్ ఖరారయిన తరువాత తిరుపతి అసెంబ్లీ టిక్కెట్ ను తన భార్య సురేఖకు కేటాయించాలని ఆయన కోరడం కాంగ్రెస్ కు కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. తనకు రాజకీయ జన్మనిచ్చిన తిరుపతి అసెంబ్లీ స్థానంలో సంబంధం బాంధవ్యాలను తెంచుకోవడం ఇష్టం లేదని అందుకే తన భార్యకు ఆ టిక్కెట్ ను కేటాయించాలని చిరంజీవి కోరుతున్నట్లు తెలిసింది. నిజానికి చిరంజీవి రాజ్యసభకు వెళితే తిరుపతిలో ఖాళీ అయ్యే స్థానంకోసం చిత్తూరు జిల్లాకు చెందిన చాలామంది నాయకులు కాసుకు కూర్చున్నారు. మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ రాజకీయాల్లో చేరడానికి చాలా ఉబలాటపడుతున్నాడు. ఒకవేళ చిరంజీవి రాజ్యసభకు వెళితే తాను గుంటూరు నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని గల్లా జయదేవ్ తన సన్నిహితుల వద్ద చెబుతున్నాడు. తిరుపతి నుంచి పోటీ చేస్తే తాను తేలికగా గెలవగలనని ఆయన భావిస్తున్నారు. గల్లా జయదేవ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, శంకరరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తిరుపతి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన శంకరరెడ్డి గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆయనకు కిరణ్ కుమార్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. తిరుపతి రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న శంకర్ రెడ్డికి నగర ప్రజలతో మంచి పరిచయాలున్నాయి. అక్కడ ఆయనకు ఒక బలమైన వర్గం కూడా ఉంది. అందువల్ల ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇస్తే తిరుపతి నుంచి పోటీ చేయాలని ఉబలాటపడుతున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లో డీఆర్‌ఐ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి ఏనుగు దంతాల అక్రమ విక్రయాల వ్యవహారాన్ని గుట్టురట్టు చేశారు.
హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ అంటేనే చరిత్రకు చిరునామా.... నగర నిర్మాణం, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు శతాబ్దాల నాటి జలవనరులు కూడా నేటికీ ఆనాటి వైభవాన్ని గుర్తు చేస్తుంటాయి.
హైదరాబాద్ రాజకీయాల్లో ఓట్ల తొలగింపు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
ఏడడుగులు కలిసి నడిచిన నాటి నుంచి ఒకే బాటగా జీవన పయనం సాగించిన ఆ వృద్ధ దంపతులు..   అంతిమ అడుగు కూడా కలిసే వేశారు. కలిసి బతికిన వారు కలిసే తనువు చాలించారు.
గతంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరి వ్యక్తుల పేర్లపై ఉన్న ఆస్తులు, ఇటీవల  కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయన్న రేవంత్ రెడ్డి..  హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు, ఫైవ్ స్టార్ హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, సర్వీస్ ప్రాపర్టీల వివరాలను వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. జిల్లాలో మొత్తం రూ.345.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది.
‘ది ప్యారడైజ్’ సినిమాలో ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రను పోషిస్తున్న నటుడు ప్రియదర్శిని మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి అభినందించారు.
లక్ష్మీ భాస్కర్‌ను ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 22న అరెస్ట్ చేశారు. ఆయన 48 గంటలకు మించి కస్టడీలో ఉన్నట్లు నిమ్స్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు పైగా కస్టడీలో ఉంటే నిబంధనల ప్రకారం అరెస్టయిన తేదీ నుంచే సస్పెండ్ అయినట్లు పరిగణిస్తారు.
హైదరాబాద్‌ పాతబస్తీలో ఆన్‌లైన్‌ ద్వారా ఆహార పదార్థాలను విక్రయిస్తున్న సంస్థలపై తెలంగాణ ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు
హైదరాబాద్‌ గచ్చిబౌలి గోపన్‌పల్లిలో హైడ్రా తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.