హీరో ఆర్యపై చీటింగ్ కేసు నమోదు..!

Publish Date:Jul 12, 2026

Advertisement

 

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో తమిళ సినీ నటుడు ఆర్యపై చీటింగ్ కేసు నమోదైంది. షూటింగ్ కోసం అద్దెకు తీసుకున్న సినీ పరికరాలకు సంబంధించిన రూ.1.80 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా మోసం చేశారంటూ హైదరాబాద్‌కు చెందిన తాహేర్ సినీ టెక్నిక్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఆర్య హీరోగా నటిస్తున్న 'అనంతన్ కాడు' చిత్రీకరణ కోసం గత ఏడాది ఫిబ్రవరిలో డిజిటల్ కెమె రాలు, లైటింగ్ యూనిట్లు సహా అత్యాధునిక షూటింగ్ సామగ్రిని తాహేర్ సినీ టెక్నిక్ సంస్థ నుంచి అద్దెకు తీసుకున్నారు. ఈ పరికరాలను హైదరాబాద్ నుంచి కేరళలో జరుగుతున్న షూటింగ్‌కు సంస్థ స్వంత ఖర్చులతో తరలించినట్లు పేర్కొన్నారు. 

మొత్తం అద్దె బిల్లు రూ.2.12 కోట్లు కాగా, అందులో రూ.1.80 కోట్లకు పైగా బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని సంస్థ ఆరోపించింది. సినిమా విడుదలకు ముందే బకాయిలన్నీ చెల్లించి 'నో డ్యూస్ సర్టిఫికేట్' తీసుకుంటామని నిర్మాత వినోద్, నటుడు ఆర్య లిఖితపూర్వ కంగా హామీ ఇచ్చినా, ఆ హామీని నిలబెట్టుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. బకాయిల కోసం పలుమార్లు ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల ద్వారా సంప్రదించినా స్పందించలేదని, డబ్బులు అడిగిన తమ సంస్థ మేనేజర్‌ను ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య వ్యక్తిగత సహాయకుడు కిశోర్ కలిసి బెదిరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. బాధిత సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉండగా, ఆర్య లేదా చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఈ ఆరోపణలపై అధికారిక స్పందన వెలువడలేదు.
 

By
en-us Political News

  
ముంబయిలో పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ సోషల్ మీడియాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అనుకరిస్తూ వీడియోలు చేసి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ సునీల్ తాజాగా క్షమాపణలు చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత ఘోరమైన, కలకలం రేపే ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ దాహం వేసి నీళ్ల బాటిల్ అనుకుని యాసిడ్ తాగడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల ఎస్. జానకి
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు సమాచారం.
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో గానకోకిలగా, నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ గాయని ఎస్. జానకి. ఆమె తన మధురమైన గానంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆదివారం ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లాలో ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
మారువేషంలో వచ్చిన మంత్రికి చేదు అనుభవం..
భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన అద్భుతమైన గాత్రంతో ఆరు దశాబ్దాల పాటు శ్రోతలను ఓలలాడించిన గానకోకిల ఎస్. జానకి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.