విశాఖపట్నం నగరాన్ని అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దే లక్ష్యంతో వీఎంఆర్డీఏ కీలక ముందడుగు వేసింది. నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించడంతో పాటు.. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణాన్ని అందించేందుకు 102 కిలోమీటర్ల పొడవైన సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదిత రహదారి రాంబిల్లి నుంచి ప్రారంభమై భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సాగుతుంది.
ఈ భారీ ప్రాజెక్టును వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ 2041లో భాగంగా చేర్చారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. దీనివల్ల నగర ప్రధాన ప్రాంతాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండానే వాహనాలు ఒక వైపు నుంచి మరో వైపుకు సులభంగా చేరుకుంటాయి. ముఖ్యంగా భారీ రవాణా వాహనాలు నగరం వెలుపలి నుంచే వెళ్లేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారిపై ఒత్తిడిని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. రాంబిల్లి వద్ద ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు , పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెళ్లే సరుకు రవాణాకు ఈ రహదారి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. భోగాపురం వద్ద నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ సెమీ రింగ్ రోడ్డు అనుసంధానం కావడం వల్ల ప్రయాణికులకు వేగవంతమైన రవాణా సదుపాయం లభిస్తుంది.
గతంలో ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా.. మరింత శాస్త్రీయంగా ఈ 102 కిలోమీటర్ల రహదారిని రూపొందించారు. దీని కోసం భూసేకరణ ప్రక్రియ, నిధుల సమీకరణపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది.
ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊపు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే జంక్షన్ల వద్ద వాణిజ్య సముదాయాలు.. లాజిస్టిక్ హబ్‌లు ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసే ఈ ప్రాజెక్టుపై స్థానిక ప్రజలు, పారిశ్రామిక వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. రాబోయే ఐదేళ్లలో విశాఖ నగరం మరింత విస్తరించడానికి ఈ సెమీ రింగ్ రోడ్డు ఒక చోదక శక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-jewel-in-visakhapatnam-crown-36-219322.html
నగరంలోని వాణిజ్య సముదాయాలు, మార్కెట్లు, ప్రధాన కూడళ్ల వద్ద పార్కింగ్ స్థలం లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల రహదారులు ఇరుకుగా మారి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కీలక ప్రాంతాలను గుర్తించి.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ఈ అత్యాధునిక పార్కింగ్ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
బండి భగీరథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. జ్యోతినగర్‌కు చెందిన ఒక యువతితో అతనికి స్నేహం ఏర్పడింది. కొంతకాలానికి ఆ యువతి అతనిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే.. భగీరథ్ పెళ్లికి నిరాకరించడంతో పరిస్థితి మలుపు తిరిగింది. ఆ యువతి, ఆమె తల్లిదండ్రులు కలిసి అతనిపై క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించారు.
పసిఫిక్ మహాసముద్రంలోని తూర్పు, మధ్య ప్రాంత ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయనీ, దీనివల్ల దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గి.. కరువు పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని తెలిపింది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందనీ, అందువల్ల సాగునీటి కొరత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.