తిరుమల కొండపై మార్పు మొదలైంది!

Publish Date:Jul 27, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో తిరుమల పవిత్రతకు భగం వాటిల్లింది. తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులకు జగన్ పాలనలో  కనీస సౌకర్యాలు కూడా కరవయ్యాయి. అంతే కాకుండా తిరుమలేశుని దర్శనాన్ని కూడా క్లిష్టతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా రాజకీయాలు జొప్పించి తిరుమల పవిత్రతను మంటగలిపేలా కొండపై నానా రకాల అరాచకాలకూ పాల్పడ్డారు. 

దీంతో దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు నానా ఇబ్బందులూ పడ్డారు. అన్న ప్రసాదం నాణ్యత నుంచి, కొండపై పరిశుభ్రత వరకూ ప్రతి విషయంలోనూ ప్రమాణాలకు తిలోదకాలిచ్చేశారు. తిరుమలకు భక్తులు రావద్దు అనే వరకూ జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం తెగించేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉంది, సౌకర్యాలు కల్పించలేం. రద్దీ తగ్గే వరకూ భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవడం మేలు అని ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కొండపై అన్యమత ప్రచారం, అన్యమతస్థులకు టీటీడీలో కొలువులు ఇలా అన్ని రకాలుగానూ నింబంధనలకు తిలోదకాలిచ్చేశారు.  ఒకరిద్దరి కనుసన్నలలోనే  తిరుమలలో అంతా జరిగేది. చివరాఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కూడా తిరుమలేశుడిని నల్లరాతితో పోల్చిన వ్యక్తినే నియమించారు.

తిరుమలేశునికి భక్తులు సమర్పించిన కానుకల సొమ్మును కూడా తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకోవడానికి వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల ప్రక్షాళనపై ఫోకస్ పెట్టారు. ఏళ్ల తరబడి అక్కడే ఉంటూ కొండపై అరాచకాలన్నిటికీ ఊతం ఇచ్చిన ఈవో ధర్మారెడ్డికి ఉద్వాసన పలికారు. అలాగే ఆయనకు వంత పాడి అక్రమాలు, అన్యాయాలకు పాల్పడిన అధికారులనూ బదిలీ చేశారు. ధర్మారెడ్డి స్థానంలో వచ్చిన ఈవో శ్యామలరావు.. తిరుమల ప్రక్షాళనపై దృష్టి సారించారు. 
తిరుమల లడ్డూ నాణ్యత తగ్గిపోవడానికి కారణమేమిటి? క్యూలైన్లో భక్తులకు అందించే అన్న ప్రసాదాన్ని ఆపివేయడానికి కారణమేంటి?  అలాగే వృద్ధుల‌కు,  త‌ల్లుల‌కు వెయిటింగ్ కంపార్టుమెంట్ లో  తిరుమల తిరుపతి దేవస్థానం పాలు సరఫరా చేసే విధానానికి కూడా తిలోదకాలిచ్చేశారు.  ఇలా గతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు గతంలో ఉన్న సౌకర్యాలన్నిటినీ ఆపివేశారు.

కొత్తగా వచ్చిన ఈవో వీటిపై దృష్టి పెట్టారు. ముందుగా  శుభ్ర‌త‌కు   ప్రాధాన్య‌త ఇచ్చారు. నిత్యం ఆక‌స్మిక త‌నిఖీలు, రివ్యూలు, హెచ్చ‌రిక‌లతో పరిస్థితిని గాడిలోకి తీసుకువచ్చారు. …. ఫ‌లితంగా టీటీడీలో మార్పు మొద‌లైంది. గ‌తంలో ఉన్న సౌక‌ర్యాలు తిరిగి మొద‌ల‌య్యాయి. ల‌డ్డూ ద‌గ్గ‌ర నుండి తిరుమ‌ల కొండ‌పై అధిక రేటుకు అమ్మే వాట‌ర్ బాటిల్స్ వ‌ర‌కు అన్నింటిపై కొత్త ఈవో ఫోక‌స్ చేశారు. వ్యాపారుల‌ను పిలిచి నిబంధ‌న‌లు ఏంటో… అవి పాటించ‌కుంటే ప‌ర్య‌వ‌స‌నాలేంటో విశదీకరించారు. అవినీతి అధికారుల‌పై వేటు ప‌డ‌టం మొద‌లైంది. నాణ్య‌త‌పై ఫోక‌స్ పెరిగింది. అంతేందుకు తిరుమ‌ల శ్రీ‌వారి ప్ర‌సాదాలకు స‌ప్లై చేసే వ‌స్తువుల నాణ్య‌త కూడా పెరిగింది. ఈవో భ‌క్తుల‌తో నేరుగా మాట్లాడుతున్నారు. సౌక‌ర్యాల గురించి ఆరా తీస్తున్నారు.  ఫ‌లితంగా ఒక్కొక్కొటిగా మార్పులు క‌నిపి స్తున్నాయి. త్వ‌ర‌లో రాబోయే పాల‌క‌మండ‌లిలో కూడా నిబ‌ద్ధ‌తతో ప‌నిచేసే వారే ఉంటారంటున్నారు.   

తిరుమలకు వచ్చే భక్తులకు  సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె. శ్యామలరావు చెబుతున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగం, అన్నప్రసాదం సిబ్బందికి, పెద్ద మరియు జనతా క్యాంటీన్‌ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  

By
en-us Political News

  
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.