జగన్‌రెడ్డి బాదుడే బాదుడు.. చంద్రబాబు కుమ్ముడే కుమ్ముడు..
Publish Date:Apr 5, 2022
Advertisement
వైసీపీ ప్రభుత్వ పన్నులు, ధరల భారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బాదుడే బాదుడు అంటూ జగన్ సర్కారుపై టీడీపీ పోరుబాట పట్టింది. ఏపీలో ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్షకు పైగా ఆర్థిక భారం పడుతోందని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తోంది. తాజాగా, జగన్‌రెడ్డి బాదుడుపై ట్విటర్‌లో చంద్రబాబు మండిపడ్డారు. "గతంలో సంతోషంగా, సంక్షేమంగా సాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయాణం...ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తుంది. చెత్త పన్నులు, పెరిగిన కరెంటు చార్జీలు, భగ్గుమంటున్న నిత్యావసరల ధరలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయి. ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడీ సరేసరి. వైసిపి సర్కార్ బాదుడే బాదుడు విధానంతో రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నారు". అని చంద్రబాబు ట్వీట్ చేశారు. "ఒక్కో కుటుంబంపై ఏడాదికి లక్షకు పైగా భారం పడుతోంది. మీ కష్టార్జితాన్ని పిండుకుని.. తాను దర్జాగా దండుకుంటున్న జగన్ పాలనపై ప్రజలు పోరాడాలి. తాను అప్పులు చేస్తూ.. వాటి కోసం మీ జేబులు ఖాళీ చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలి. పథకాల పేరుతో 10 శాతం మీకిచ్చి.. మిగతా 90 శాతం తమ జేబుల్లో వేసుకుంటున్న దోపిడీని ప్రశ్నించాలి. ప్రభుత్వ పన్నులు, బాదుడుపై ప్రతిపక్ష టిడిపి చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి." అంటూ టీడీపీ అధినేత పిలుపు ఇచ్చారు.
http://www.teluguone.com/news/content/chandrababu-tweet-on-cm-jagan-39-133950.html





