అంబ‌టికి మంత్రి ప‌ద‌వి!.. అందుకేనా జ‌గ‌న్ ప్ర‌యారిటీ?

Publish Date:Apr 5, 2022

Advertisement

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకి జగన్ కేబినెట్‌లో సీటు గ్యారంటి అనే చర్చ అయితే కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లాలో తెగ వైరల్ అవుతోంది. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు.. విడుదల రజినీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ.. అంబటి రాంబాబు వైపే సీఎం జగన్ మొగ్గు చూపినట్లు సమాచారం. అదీ కూడా కేబినెట్‌లో కీలక శాఖను అంబటికి కట్టబెట్టాలనే ఓ కృతనిశ్చయంతో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. 

తాజాగా ఏర్పడిన ఈ జిల్లాలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినీ.. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. 2019 ఎన్నికల్లో గెలిచి.. ఆమె తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. దీంతో క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి ఆమెకు కేబినెట్‌లో ఛాన్స్ దక్కే అవకాశం కొద్దిగానే ఉందని సమాచారం. అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా పార్టీలో సీనియర్ నేత. కానీ ఆయన క్యాస్ట్ ఈక్వేషన్స్ బట్టి.. ఆయనకు కేబినెట్‌లో ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక జగన్ తన పాత కేబినెట్‌లోని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. ప్లేస్‌ను ఈ అంబటి రాంబాబుతో ఫిల్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చేది ఎన్నికల వేళ.. గతంలో సత్తెనపల్లిలో కొడెల శివ ప్రసాద్ వర్గందే పై చేయి.. కానీ నేడు ఆ పరిస్థితి అక్కడ లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ సత్తెనపల్లిలో ఫ్యాన్ పార్టీ సత్తా చాటాలంటే.. అంబటికి మంత్రి పదవి ఇచ్చి తీరాలని సీఎం మొండి పట్టుతో ఉన్నట్లు.. సజ్జల కార్యాలయంలో ఓ టాక్ అయితే నడుస్తోంది.  

ఇక అంబటి రాంబాబు గురించి అందరికీ తెలిసిందే. ఈ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడంటే.. అది ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ బాబు లేదా జనసేనాని పవన్ కల్యాణ్‌పైన అయినా ఉంటుందనే ఓ టాక్ అయితే.. ఇటు ప్రజల్లోనే కాదు.. అటు మీడియా వారికి కూడా బాగా అర్థమైపోయింది. అంబటి రాంబాబు నోరున్న నేత అన్న సంగతి అందరికీ తెలిసిందే. 

అంతేకాదు.. ఆయా పార్టీల నేతలపై అంబటి రాంబాబును నిద్రలో లేపి అడిగినా.. ఒంటి కాలితో లేచి.. వారిపై  మండిపతారన్న ఓ చర్చ అయితే ఫ్యాన్ పార్టీలోనే అండర్ కరెంట్‌గా రంజు రంజుగా నడుస్తోంది. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి జగన్ పార్టీ అభ్యర్థిగా అంబటి పోటీ చేసి టీడీపీ సీనియర్ నేత కొడెల శివప్రసాద రావు చేతిలో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత  2019 ఎన్నికల్లో మళ్లీ ఆయనపై పోటీ చేసి.. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు తన సత్తాను చాటారు. జగన్ తొలి కేబినెట్‌లోనే రాంబాబును తీసుకుంటారని అంతా భావించారు. కానీ కొత్త వారికి... ఆయన కంటే జూనియర్లకు జగన్ అవకాశం ఇచ్చారు. 

వైయస్ఆర్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా ఎవరైనా ఉన్నారంటే.. అదీ అంబటి రాంబాబు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే... ఆ ఫ్యామిలీకి 100కి 100 శాతం లాయిల్టీగా ఉండే వ్యక్తి ఈ అంబటి రాంబాబు. 1989లో రేపల్లి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 1994, 1999 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత.. అంబటి రాజకీయాల్లోనే ఉంటూ.. రాజశేఖర్ రెడ్డికి బాగా దగ్గరయ్యారు. 

ఆ క్రమంలో 2004లో నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి.. నీకు ఎమ్మెల్యే సీటు ఇస్తానంటే.. వద్దు వద్దు.. మీరు ముఖ్యమంత్రి అయితే చాలంటూ తన వినయాన్ని.. తన వీర విధేయతను.. ఆ పెద్దయాన ముందు ప్రదర్శించి..మార్కులు కొట్టేశారీ అంబటి రాంబాబు. అంతే ఆ ఎన్నికల్లో వైయస్ ఇలా సీఎం కావడం.. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ పదవిని అలా అంబటికి కట్టబెట్టడం జరిగిపోయింది. అప్పటి నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి అడుగులో అడుగు వేసి మరీ నడిచారు. 

ఆ తర్వాత వైయస్ఆర్ ఆకస్మిక మరణంతో.. వైయస్ జగన్ వెంట అంబటి నడిచారు. ఆ క్రమంలో వైయస్ జగన్.. కొత్త పార్టీ స్థాపించడంలో ఈయనదే కీలక పాత్ర. అంతేకాదు.. వైయస్ జగన్ 16 నెలలు జైలుకు వెళ్లినప్పుడు.. ప్రతి రోజు ఆ  పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టి మరీ.. నాటి ప్రతిపక్ష పార్టీని తన వాక్ చాతుర్యంతో చీల్చి చండాడే వారన్న సంగతి అందరికీ తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు వైయస్ ఫ్యామిలీకి.. ఎంత చేయాలో అంబటి రాంబాబు అంత చేశారనే ఓ చర్చ అయితే నాడు లోటస్ పాండ్ లోనే కాదు.. నేడు తాడేపల్లి ఫ్యాలెస్ సాక్షిగా వైరల్ అవుతోంది. అలాంటి నేతకు అమాత్య పదవి ఇచ్చి.. అందలం ఎక్కించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత భావిస్తున్నారట.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.