బి.సి.లు చంద్రబాబును నమ్మరా?

Publish Date:Jul 13, 2012

Advertisement

2012 ఉప ఎన్నికల్లో పరాజయం తెలుగుదేశం పార్టీ అథినేత నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల్లో తీవ్రమైన మార్పును తీసుకువచ్చింది. ఇంకా రెండు సంవత్సరాల సమయమున్నా సమీక్షలు, సమన్వయ సమావేశాలతో బిజీబిజీగా ఉన్న ఆయన ఇటీవల బిసిలకు తమ పార్టీ తరుపున వంద అసెంబ్లీస్థానాలు కేటాయిస్తామని సంచలన ప్రకటన చేశారు. ఆ తరువాత ఇతర సమావేశాల్లో పడి మళ్లీ బిజీ అయిన చంద్రబాబును తాజాగా బిసికులసంఘాలు సన్మానించాయి.


ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో వందస్థానాల నుంచి బిసిలు పోటీ చేస్తున్నందున వారి గెలుపుబాధ్యత కులసంఘాలే తీసుకోవాలని కోరారు. తానిచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తే నిధులు కూడా మంజూరు చేస్తానని చంద్రబాబు బిసి సంఘాలకు హామీ ఇచ్చారు. కులసంఘాల నాయకులు కూడా చంద్రబాబు మాటలకు స్పందించారు. ముందస్తుగా బిసిలకు వంద స్థానాలు ప్రకటించినందున తాము తెలుగుదేశం పార్టీకి కట్టుబడి పని చేస్తామని బిసి సంఘాల నేతలు  ప్రకటించారు. తమవారి గెలుపుద్వారా రాజ్యాధికారం సాధించుకోవాలన్న పిలుపుకు అనుగుణంగానే తాము పని చేస్తామని బిసి సంఘాలు తెలిపాయి.



తెలుగుదేశంతో మమేకమై పని చేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్న ఆశ తమకు ఏర్పడిరదని ఈ సందర్భంగా నేతలు ప్రకటించారు. ఏదేమైనా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచి గెలుపు కోసం బిసి సంఘాలను దువ్వటం మొదలుపెట్టారు. ఈయన తీసుకున్న ఈ చర్యల వల్ల ఇతర జాతీయపార్టీలూ బిసిలకు తప్పనిసరిగా వందస్థానాలు కేటాయించాల్సి వస్తుందని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. మరి ఒకే కులం నుంచి ఇద్దరు పోటీ చేస్తే సంఘాలు కూడా గెలుపు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలవా? అసలు బి.సి.లు నిజంగా చంద్రబాబును నమ్ముతారా? గెలుపు కోసం కులసంఘాలను నమ్ముకుని బాబు  ఆశలపందిరి అల్లుకోవటం ఎంతవరకూ ఫలితానిస్తుందో భవిష్యత్తులోనే తేలుతుంది.

 

By
en-us Political News

  
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
తెలంగాణ రాజకీయాల్లో సన్నవడ్ల సాగు అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాసరలోని  రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం  ట్రిపుల్ ఐటీ లో అసాధారణ పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో వేలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో అక్కడ   నీటి ఎద్దడి తీవ్రతరమైంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా, స్థానిక నీటివనరుల్లో నీటి లభ్యత లేకుండా పోయింది.
తెలంగాణ భవన్ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
జీవితాంతం కలిసుంటామని మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది.
గతంలో హైదరాబాద్ నగరం తక్కువ ధరలో మెరుగైన మౌలిక వసతులతో కూడిన నివాసాలను అందించే ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ ఇటీవల ప్రైమింగ్ వ్యూహాలు,  విలాసవంతమైన ప్రాజెక్టులపై రియల్టర్లు, బిల్డర్లు అతిగా దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగి.. ఇళ్లు కొనుగోలు అంటేనే సాధారణ, మధ్య తరగతి, వేతన జీవులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది
వనదేవతలు పూజలందుకునే గుడిని గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేయడం పట్ల భక్తులు,  గిరిజనులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు.
అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రకృతి అందాలను పెంచే మూగజీవాలపై తుపాకీ గురిపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం, శాంతిభద్రతల పటిష్టత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులు, అసాధారణ వాతావరణ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
1,000 మందికి పైగా టార్గెట్‌.. నిందితుడు అరెస్టు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.