భాష ఫై చంద్రబాబు నాయకులకు క్లాస్
Publish Date:Dec 4, 2012
Advertisement
పల్లెల్లోని ప్రజల వద్ద ఉపయోగించాల్సిన భాష ఫై తెలుగు దేశం అధినేత చంద్ర బాబు నాయుడు తన పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. జగన్ లక్ష కోట్లు తిన్నాడని ప్రజలకి చెపితే వారికి అర్ధం కాదని, వెయ్యి లారీల డబ్బు తిన్నాడని ( జగన్ డబ్బును వందల నోట్లలోకి మారిస్తే) చెపితే అర్ధమవుతుందని బాబు అన్నారు. తాను జగన్ అవినీతిని ప్రజలకు అర్ధమయ్యే భాష లో వివరించినపుడు ప్రజలనుండి స్పందన అధికంగా వచ్చిందని బాబు వెల్లడించారు. ఇలా చెపితే నాయకులకు ఏమి అర్ధమౌతుంది ? పార్టీ ముఖ్య నాయకులందరినీ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు పిలిపించి, రాజకీయ పరిబాష పుష్టిగా ఉన్నవారితో ప్రత్యెక క్లాస్ ఇప్పిస్తే ఉపయోగం ఉంటుంది.
మొత్తానికి తన వెయ్యి కిలోమీటర్ల పాద యాత్ర లో బాబు సరికొత్త విషయాలను నేర్చుకుంటున్నట్లుగా ఉంది. ప్రజలను ఆకట్టుకోవడానికి బాబు చేసే ఈ కొత్త ఆలోచనలు తగిన ఫలితాలు ఇస్తాయో, లేదో తేలాలంటే మాత్రం 2014 వరకూ వేచి చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/chandrababu-24-19500.html





