విన్ విన్ ఫార్ములాతో బీజేపీకి బాబు ఎర!?

Publish Date:Jun 9, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పొత్తు పొడుపుల చర్చ ఎన్నికల వరకూ సాగుతూనే ఉండేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో వైసీపీకి ప్రజాదరణ వేగంగా, గణనీయంగా తగ్గిపోతోందన్న అంచనాతో పార్టీలు వేటికవి తమ స్థానాన్ని బలోపేతం చేసుకోవిడానికి ఇదే అదును అని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పొత్తు పొడుపుల చర్చ ఆగకుండా నడుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పర్యటనతో పొత్తు పొడుపులపై దాదాపు స్పష్టత వచ్చింది.

జనసేనాని ఆప్షన్ ఇవ్వడం ద్వారా ఇటు తెలుగుదేశం పార్టీ, అటు బీజేపీ రెంటికీ పెద్దగా అక్కరకు రాని మిత్రుడిగా మిగిలిపోయారు. ఇక మిగిలింది తెలుగుదేశం, బీజేపీ.. ఈ రెండు పార్టీలూ కూడా ఏపీలో కలిసి పోటీ చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాయి. అయితే బీజేపీకి ఏపీలో కనీసంలో కనీసం ఒక శాతం ఓట్లయినా ఉన్నాయా అన్నది అనుమానమే. అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం, మరో మారు అధికారం చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉండటంతో ఆ పార్టీకి ఏపీలో అసెంబ్లీ స్థానాల కన్నా.. పార్లమెంటు నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను గెలిపించుకోవడం ముఖ్యం. దీంతో పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవాలంటే అందుకు తెలుగుదేశంతో పొత్తు ఆ పార్టీకి అవసరం.

జనసేనతో కలిసి వెళ్లినా.. ఆ పార్టీ అండతో పార్లమెంటు స్థానాలలో విజయం సాధించగలమన్న ధీమా బీజేపీలో కనిపించడం లేదు. దానికి తోడు ఆయన చీటికీ మాటికీ   తన బలాన్ని హెచ్చుగా ఊహించుకుంటూ కండీషన్స్ అంటున్నారు. ఈ కారణంగానే నడ్డా తన రాష్ట్ర పర్యటనలో భాగంగా చేసిన ప్రసంగాలలో ఎక్కడా జనసేన ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరిని విస్పష్టంగా తెలియజేశారు.

అంతటితో ఊరుకుని ఉంటే తెలుగుదేశం, బీజేపీ పొత్తులపై ఇన్ని రాజకీయ స్పెక్యులేషన్స్ వచ్చి ఉండేవి కావు. ఇప్పటి దాకా రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ పై ఒకింత అభిమానం ఒలకబోస్తూ తమల పాకుతో తట్టినట్లుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ, విపక్ష తెలుగుదేశంపై మాత్రం పదునైన ఘాటు విమర్శలతో విరుచుకుపడేవారు. నడ్డా అందుకు భిన్నంగా తెలుగుదేశంపై చిన్న పాటి విమర్శ కూడా లేకుండా, అదికార వైసీపీపైనే తన విమర్శల దాడి సాగించారు.  ఇది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి చేరువ అవ్వడానికి బీజేపీ సిద్ధమన్న సంకేతం ఇవ్వడమే. ఆ సంకేతాన్ని తెలుగుదేశం సరిగ్గానే అందిపుచ్చుకుంది. బీజేపీతో పొత్తు కుదిరితే లాభ నష్టాలపై పార్టీలో అధినేత చంద్రబాబు నేతృత్వంలో చర్చలు జరుగుతున్నట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చల్లో పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు వల్ల లాభల కంటే నష్టాలే ఎక్కువ అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమైందని చెబుతున్నారు. ఎందుకంటే జనసేనతో పొత్తు ఉంటే.. పొత్తులో భాగంగా కనీసంలో కనీసం పాతిక అసెంబ్లీ స్థానాలైనా ఆ పార్టీకి వదులు కోవాల్సి ఉంటుంది.

అన్ని స్థానాలలో విజయం సాధించేంత బలం ఆ పార్టీకి ఉందో లేదో అనుమానమే. ఈ అనుమానానికి గత ఎన్నికలలో ఆ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించడం, ఆ పార్టీ అధినేత స్వయంగా రెండు స్థానాలలో పోటీ చేసి రెండు చోట్లా పరాజయం పాలు కావడమే కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి అసెంబ్లీ స్థానాలపై పెద్దగా పట్టు ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో తమ స్టేక్ ఏమిటి, తమ బలం ఏమిటి, తమకు ఉన్న ఓటు శాతం ఎంత అన్న స్పష్టత ఉంది.  

అదీ కాక ఆ పార్టీకి రాష్ట్రంలో అధికారం చేపట్టడం కన్నా కేంద్రంలో అధికారం నిలుపుకోవడమే ముఖ్యం. అందు కోసం  ఆ పార్టీ పొత్తులో భాగంగా అసెంబ్లీ స్థానాల కోసం పెద్దగా పట్టుబట్టదు. ఆ పార్టీకి పార్లమెంటు స్థానాలలో తమ అభ్యర్థుల విజయం అవసరం. ఇక తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో చక్రం తిప్పాలన్న ఉద్దేశం ఇప్పటికైతే లేదు. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యం. అందుకే బీజేపీతో  పొత్తు కుదరడమంటూ జరిగితే.. ఆ పార్టీకి రాష్ట్రంలోని పాతిక పార్లమెంటు స్థానాలలో సగం వరకూ ఆ పార్టీకి కేటాయించడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఇది విన్ విన్ ఫార్ములాగా చంద్రబాబు భావిస్తున్నారు.

ఇదే ప్రతిపాదనతో బీజేపీకి ఎర వేయాలని ఆయన పార్టీ నేతలతో చర్చ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీకి కూడా ఈ ప్రతిపాదన ఆ పార్టీ అవసరాలకు తగినట్లు ఉంటుంది. రాష్ట్రంలో బలం లేకపోయినా తెలుగుదేశం అండతో పోటీ చేసే పార్లమెంటు స్థానాలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆప్షన్స్ వల్ల తెలుగుదేశం, బీజేపీ దగ్గరయ్యే పరిస్థితి వచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.