వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వానికి కేంద్రం అండ!

Publish Date:Aug 4, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో జగన్  ఆర్థిక అరాచకత్వానికి కేంద్రంలోని  మోడీ సర్కార్ పూర్తిగా అండదండలు అందిస్తోందా? జగన్ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పార్లమెంటు సాక్షిగా అసత్యాలు, అర్ధ సత్యాలు చెబుతోందా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననక తప్పదని పరిశీలకులు అంటున్నారు.  లోక్ సభ సాక్షిగా జగన్ సర్కార్ అప్పులపై వైసీపీ రెబల్ ఎంపీ ప్రశ్నకు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ జవాబు చెప్పిన రోజుల వ్యవధిలో రాజ్యసభలో  తెలుగుదేశం సభ్యుడు కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ చెప్పిన సమాధానం  పరస్పర విరుద్ధంగా ఉండటాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.

పార్లమెంటులో నిర్మలా సీతారామన్ జగన్ ప్రభుత్వ అప్పులన్నీ నిబంధనలకు లోబడే ఉన్నాయని చెబితే..  రాజ్యసభలో భగవత్ కరాద్  ఎఫ్ ఆర్ బి ఎం పరిమితిని దాటి జగన్ ప్రభుత్వం అప్పులను తీసుకుందనీ తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 (3) నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని   పేర్కొన్నారు. కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణించాలని సూచించారు. కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి లోక్ సభలో రఘురామకృష్ణం రాజు ప్రశ్నకు ఇచ్చిన జవాబు ఆమె వద్ద ఉన్న పరిమిత సమాచారం ఆధారంగానే ఇచ్చారని కుండబద్దలు కొట్టేశారు.  మొత్తంగా కేంద్ర మంత్రులు ఒక రాష్ట్రం అప్పులపై ఇచ్చిన రెండు సమాధానాలనూ బేరీజు వేసుకుని చూస్తే జగన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చేందుకు కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందనీ పరిశీలకులు అంటున్నారు.

 ఈ రెండు సమాధానాలనూ ఉటంకిస్తూ.. రచ్చబండలో భాగంగా బుధవారం (ఆగస్టు 2) న మీడియాతో మాట్లాడిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు జగన్ ప్రభుత్వ అప్పులపై తాను వెల్లడించిన వివరాలు అక్షర సత్యాలని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో జగన్ అయినా సరే ఆయన వంది మాగధులైనా సరే చర్చకు రావాలని సవాల్ విసిరారు.  తానే కాదు..  బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి  కూడా జగన్ అప్పుల బాగోతాన్ని పూసగుచ్చినట్లు వివరించారన్నారు.  

జగన్ ప్రభుత్వం అప్పులు, ఏయే ఆస్తులను తాకట్టు పెట్టి ఎంతెంత అప్పు చేసింది అన్న వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఎఫ్ ఆర్ బి ఎం పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేసే వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే ఇప్పటికే అంటే ఈ ఆర్థిక సంవత్సరం లో తొలి నాలుగు నెలలలోనే 29 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసిన ఏపీ సర్కార్ కు మరో మూడువేల కోట్ల రూపాయల రుణానికి ఎలా అర్హత లభించిందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.