చంద్రబాబు పెన్నా టూ వంశధార.. జగన్ ఎక్కడ నుంచి ఎక్కడికి?

Publish Date:Aug 4, 2023

Advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. జగన్ సర్కార్ ఎక్కడ ఫెయిలైందో చంద్రబాబు అక్కడే ప్రజల నాడి పట్టుకుంటున్నారు. అందులో భాగమే పెన్నా టూ వంశధార టూర్. ప్రాజెక్టుల నిర్మాణంలో జగన్ సర్కార్ ఘోరంగా ఫెయిలైంది. ఇది రాజకీయ విశ్లేషకులు, సాగునీటి రంగ నిపుణులు చెప్తున్న మాటే. అయితే, ఇప్పుడు అదే విషయాన్ని ప్రజలకు చెప్పాలని చంద్రబాబు బయల్దేరారు. 'పెన్నా టు వంశధార' పేరుతో చంద్రబాబు ఆగస్టు 1 నుంచి ప్రాజెక్టుల సందర్శన మొదలు పెట్టారు. మొత్తం 10 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ఆగస్టు 1వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదలైన ఈ కార్యక్రమంలో తొలి రోజు మచ్చుమర్రి, బంకచర్ల ప్రాజెక్టులను సందర్శించారు. 

ఆగస్టు 2న కొండాపురం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు.. గురువారం (ఆగస్టు 3) ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, గొల్లపల్లి రిజర్వాయర్‌లను సందర్శించారు. ఇక, శుక్రవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్‌ కెనాల్‌ సందర్శించనున్నారు. కాగా, ఒకవైపు ప్రాజెక్టుల సందర్శిస్తూనే మరోవైపు ఎక్కడిక్కడే సభలు కూడా ఏర్పాటు చేసి.. నాలుగేళ్ళలో జరిగిన నష్టాన్ని లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సభకు భారీ సంఖ్యలో జనాలు రావడంతో.. జగన్ పులివెందులలో నాకు జనాలు ఎలా వచ్చారో ఒక్కసారి చూడు అంటూ  చూపించారు. పులివెందులలో టీడీపీ సభ జరగడం, పెద్ద ఎత్తున స్వాగతం పలకడం నిజంగా విశేషమే.

చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన మొదలై మూడు రోజులే  అయ్యింది. ఆయన పర్యటన మరో వారం రోజులు  కొనసాగుతుంది. ఈ వారం రోజులలో టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని మరింతగా ప్రజలోకి చేరస్తాయి. కాగా ప్రాజెక్టుల నిర్మాణంలో వైసీపీ విఫలమవడానికి కారణం నిధులను కేటాయించకపోవడమే. ఎంతసేపూ పప్పు బెల్లాల మాదిరి తలకి ఇంత లెక్కేసి పంచడం, రాష్ట్రంలో అభివృద్ధి లేక ఆదాయానికి గండిపడడంతో తీవమైన నిధుల కొరత ఏర్పడింది. దీంతో జగన్ సర్కార్ ప్రాజెక్టులను పట్టించుకోవడమే మానేసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు గత వారమే లెక్కలతో సహా ఎన్టీఆర్ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏకి పారేశారు. ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ఇదే విషయంపై ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. కమాన్.. మీరేం చేశారో చర్చకు రండి.. ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుందాం అంటూ సవాళ్లు విసురుతున్నారు.

ఇంత జరుగుతున్నా..  సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఎలాంటి స్పందన లేదు. టీడీపీని ఎదుర్కొనేందుకు వైసీపీ ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. చంద్రబాబు చేసే ఆరోపణలను ఖండించలేకపోతోంది. కనీసం సమాధానం కూడా చెప్పలేకపోతోంది.   జగన్ తన తాడేప‌ల్లి  ప్యాలస్ లోఏవో వ్యూహాలు ర‌చిస్తున్నారని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు తప్ప ఆయన బయటకి రావడం లేదు. వైసీపీపై నలువైపులా వ్య‌తిరేక‌త పెంచే చ‌ర్య‌ల‌ను టీడీపీ వేగ‌వంతం చేస్తోంది. ఎ  టీడీపీ దూకుడు మీద ఉంది. కానీ, వైసీపీలో ఎలాంటి జోష్ కనిపించడం లేదు. చంద్ర‌బాబు చేసే ఆరోపణలకు వైసీపీ నుండి ఎక్కడా ఎలాంటి  సమాధానం రావడం లేదు.

సాగునీటి రంగానికి వ‌చ్చే స‌రికి.. లెక్క‌ల‌తో స‌హా వివ‌రించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం పెట్టింది పెద్దగా లేదు. ఏవో కాకి లెక్కలు తెచ్చి బురిడీ కొట్టించే తెలివితేట‌లు గల నేతలు వైసీపీ కేబినెట్‌లోనూ, స‌ల‌హాదారుల్లోనూ కనిపించడం లేదు. అందుకే వ్యక్తిగత దూషణకి దిగుతున్నట్లున్నారు. కానీ, ఇలాంటి ప్రజా ప్రయోజన ఆరోపణలకు సమాధానం చెప్పలేకపోతే వైసీపీ కొంప మునగడం ఖాయం. మరి తాయిలాలే తనకి ఓట్లు తెస్తాయని ఇంకా జగన్ భ్రమలోనే ఉంటారా? లేక తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకొచ్చి చంద్రబాబు ఆరోపణలకు లెక్కలు చెప్తారా అన్నది చూడాల్సి ఉంది. 

By
en-us Political News

  
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.