కేసీఆర్ జాతీయ ప్రస్థానానికి ఫుల్ స్టాపేనా?

Publish Date:Aug 4, 2023

Advertisement

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ గతంలో రాష్ట్రాలు చుట్టేసిన కేసీఆర్ ఇప్పుడు తన యాత్రలను మహారాష్ట్రకే పరిమితం చేశారు. ఇందుకు కారణాలేమిటన్నది పక్కన పెడితే.. ఆయన జాతీయ రాజకీయాలలో ప్రత్యర్థి మాత్రం బీజేపీ ఎంత మాత్రం కాదని తన తీరు ద్వారా తేటతెల్లం చేస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యం అంటూ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించిన కేసీఆర్.. ఆ తరువాత మోడీ సర్కార్ పై విమర్శలు చేయడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు.

పైపెచ్చు మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తున్న విపక్ష కూటమితో కూడా అడుగులు కలపడం లేదు. దీంతో బీఆర్ఎస్ తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో విస్తరణ విషయాన్ని పట్టించుకోకుండా మహాపైనే ఎందుకు దృష్టి పెట్టారన్న ప్రశ్నలూ ఉత్పన్నమౌతున్నాయి. మహారాష్ట్రలో శివసేనను  నిట్టనిలువునా చీల్చి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన బీజేపీపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఆ వ్యతిరేకత వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

దీంతో మహారాష్ట్రలో బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ఉద్దేశంతోనే కేసీఆర్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణకు శ్రీకారం చుట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే సమయంలో విపక్ష కూటమిలో భాగస్వామి కాకుండా దూరంగా ఉండటం ద్వారా బీజేపీ వ్యతిరేక శక్తులు బలోపేతం కాకుండా తన వంతు ప్రయత్నం చేశారని భావించాల్సి ఉంటుందని అంటున్నారు. తొలుత జాతీయ రాజకీయాలలో ప్రవేశం అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. అప్పట్లో ఇప్పుడు విపక్ష కూటమి ‘ఇండియా’లోని భాగస్వామ్య పార్టీల నేతలందరితో భేటీ అయ్యారు. అప్పట్లో కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేసినప్పుడే పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

నెలల తరబడి అదిగో ఇదిగో అంటూ ఆయన చేసిన తాత్సారంతో ఆయన జాతీయ రాజకీయ ప్రవేశం నాన్నా పులి కథ చందంగా ఉందన్న విమర్శలు సైతం అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇక ఇపుడు ఇంత దూరం వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం సంగతి అటుంచి ఉనికి కూడా అనుమానమేనన్న అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన జాతీయ రాజకీయాల అంశానికి ఇంట్రవెల్ కాదు, ఫుల్ స్టాప్ పడిపోయినట్లేనని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈసీ ప్రమాణాల మేరకు ఓట్లు, సీట్లు రాకుంటే భారత్ రాష్ట్ర సమితి అనబడే బీఆర్ఎస్ కేవలం తెలంగాణకు పరిమితమైన ప్రాతీయపార్టీగానే మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు.  

By
en-us Political News

  
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.