సీబీఐ బోనులో మమతా దీదీ..

Publish Date:Aug 20, 2021

Advertisement

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,బీజేపీ  నాయకులు కార్యకర్తల మధ్య మాటల  యుద్ధం జరిగింది. ప్రజలు తీర్పు ఇచ్చారు. అక్కడితో ఎన్నికల యుద్ధం ముగిసింది. కానీ, ఆ వెంటనే రాజకీయ యుద్ధం మొదలైంది. అనూహ్యంగా అద్భుత విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల విజయం తెచ్చి పెట్టిన ఉత్సాహం, ఎన్నికల సందర్భంగా ఎదురైన చిన్నపాటి ఎదురు దెబ్బల తాలూకు అవమానాలను జతచేసి కత్తులు తీశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల పై యుద్దాన్ని ప్రకటించారు.తాలిబాన్ల తరహాలో దాడులకు తల పడ్డారు.

ఎన్నికల అనంతరం చెలరేగిన హింసలో సాముహిక మానభంగానికి గురైన ఓ 17 ఏళ్ల బాలిక సహా ఇతర బాధితులు  సుప్రీం కోర్టులో దాఖలుచేసిన పిటీషన్ల ప్రకారం, అలాగే రాష్ట్ర హై కోర్టులోదాఖలైన అనేక పిటీషన్ల ప్రకారం గృహ దహనాలు, మానభంగాలు, బహిరంగంగా రాళ్ళతో కొట్టి, చెట్లకు కట్టి చంపడం వంటి భయంకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిజానికి, ఎన్నికల అనతరం హింస జరిగిందని, రాజకీయ హత్యలు జరిగాయని, స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికంటే ముందుగా అంగీకరించారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆమె పెద్ద మనసు చేసుకుని ప్రభుత్వం తరపున నష్ట పరుహారం ప్రకటించారు. కానీ,ఎన్నికల అనంతర హింసపై సీబీఐవిచారణకే, కాదు అసలు ఎలాంటి విచారణకు అంగీకరించలేదు. అంతే కాదు, హింసాత్మక  సంఘటనలు జరిగిన ప్రాంతాలలో పర్యటించిన, బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించలేదు,  , చివరకు గవర్నర్ పర్యటనలకు మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంది. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పర్యటనలను తృణమూల్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కమిషన్ సభ్యుల మీద కూడా దాడులు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదులు అందాయి, అయినా మమతా బెనర్జీ ప్రభుత్వం పట్టించుకోలేదు. హింస ఒక రొటీన్ వ్యవహారం అన్నట్లుగా మమతా బెనర్జీ, తేలిగ్గా తీసుకున్నారు. 

చివరకు తృణమూల్ హింస రచన విషయం రాష్ట్ర హై కోర్టుకు చేరింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగిన నేరాలు, ఘోరలపై సీబీఐ విచారణ జరిపించాలని, కోరుతూ దాఖలైన అనేక పిటీషన్లపై విచారణ జరిపిన కలకత్తా హై కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది.  ఇందులో, హత్యలు, మహిళలపై జరిగిన దాడులకు సంబదించిన ఆరోపణలఫై సీబీసి విచారణ జరిపించాలని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు నిచ్చింది. ఇతర కేసుల విచారణకు న్యాయ స్థానం పశ్చిమ బెంగాల్ క్యాడర్’కు చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో, ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటు చేసింది. గతంలో,  హై కోర్ట్ ఆదేశాల మేరకు ఎన్నికల అనంతర హింసపై విచారణ జరిపిన జాతీయ మానవహక్కుల సంఘం, సీబీఐ విచారణ సిఫార్సు చేస్తూ జూలై 13న, న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా హైకోర్టు గురువారం తీర్పు నిచ్చింది. 

ఇక అసలు విషయంలోకి వస్తే, రాష్టంలో హింస జరగడం ఒకెత్తు, అయితే, తీర్పులో  న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు, ఎన్నికల అనంతర చెలరేగిన హింస విషయంలో, అసలు విచారణే అవసరం లేదన్నట్లుగా వ్యహరించిన ముఖ్యమంత్రి మమత బెనర్జీకి చెంప పెట్టులా ఉన్నాయని రాజాకీయ పరిశీలకులు భావిస్తున్నారు. న్యాయమూర్తులు, జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ ఐపీ ముఖర్జీ, జస్టిస్ హరీష్ టాండన్, జస్టిస్ సౌమేన్ సేన్, జస్టిస్ సుబ్రతా తలుక్దార్ టం తీర్పులో, “ హత్య, మానభంగం వంటి హేయమైన నేరాలపై, స్వతంత్ర నేర పరిశోధన సంస్థ, ప్రస్తుత పరిస్థితులలో సీబీఐ, విచారణ అవసరం..అనేక కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంలో కూడా విఫలమైంది. ఇది, విచారణను పక్కదోవ పట్టించే ముందస్తు ప్రణాళికను తెలియచేస్తుంది” అని పేర్కొంది. అందుకే అంతిమ తీర్పు ఎలా  ఉన్నప్పటికీ, హై కోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మింగుడు పడక పోవచ్చును. ఆమె ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడవలసి ఉంది.  ఇంతవరకు అయితే ఆమె హై కోర్టు ఆదేశాలపై మౌనంగానే ఉన్నారు. ఇక ముందు ఎలా స్పందిస్తారు,విచారణ ఏ మలుపు తిరుగుతుందో చూడవలసి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.