సిబిఐ పనితీరుపై విమర్శల వెల్లువ
Publish Date:Jul 7, 2012
Advertisement
ఇటీవల జరిగిన సిబిఐ విచారణల తీరు తెన్నులను పరీశీలించినట్లయితే రాష్ట్రనికొక పద్దతి చొప్పున దానిపనితీరు ఉండటం మేధావులనే కాక సామాన్యప్రజానీకానికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బయటి రాష్ట్రాలలో జరిగిన కేసులను పరిశీలించినట్లయితే ఆదర్శ్, 2 జి సెక్ట్రమ్, తాజ్ కారిడార్ స్కాముల్లోని నిందుతులు త్వరగానే జైలునుండి వారు బయటకు వచ్చారు. వీరిపై కేసులు పెట్టిన సి.బి.ఐ వివాదాలకు గురయింది. తాజాగా మాయావతి కేసు విషయంలో సిబిఐ ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. మన రాష్ట్రానికి సంబందించి మాత్రం సిబిఐ పనితీరు కూడా వివాదాస్పదంగా ఉంది. ఇక్కడ నిందుతులంతా నెలలతరబడి బెయిలు కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. వారి విషయంలో సిబిఐ పనితీరు పలు అనుమానాలకు తావిస్తుంది. సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్ అయిన బిపి ఆచార్య, వై శ్రీలక్ష్మీ, రిటెర్డ్ ఆఫీసర్ విడి రాజగోపాల్, ( గాలి గనుల కేసులో ) బివి శ్రీనివాసరెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ , యన్ శ్రీనివాసరెడ్డి, వైయస్ జగన్మోహనరెడ్డి మొదలైన వారంతా జైల్లోనే మగ్గటానికి కారణం వారు దేశం విడిచి వెళతారనో లేదా వారు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారనో కాదు. కేవలం సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరి బెయిల్ పిటీషన్లను బలంగా నిరోధించటం వల్లే ఇలా జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. బహుశ ఆదర్శ్కుంభకోణంలోనూ, 2జి స్సెక్ట్రమ్కేసులోనూ, తాజ్కారిడార్ స్కామ్లోలా నిందుతులు కాంగ్రెస్ అధినేతలను ప్రసన్నం చేసుకున్నందువల్లే బెయిలు వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా వైసిపి నాయకులు కాంగ్రెస్తో కాంప్రమైజ్ అయితే జగన్ బెయిలు రావడం తేలికవుతుందని ప్రచారం జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/cbi-case-dealings-24-15420.html





