35కేసులు..24విచారణలు..ఒక్క రిమార్కు లేదు

Publish Date:Feb 23, 2012

Advertisement

హైదరాబాద్: తనపై 35 కేసులు పెట్టారని, 24 విచారణలు జరిపించారని, అయినా తనపై ఒక్క రిమార్కు కూడా లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తనను ఏమీ చేయలేరని ఆయన అన్నారు. తన ప్రభుత్వ హయాంలో తాను ఏ తప్పూ చేయలేదని ఆయన అన్నారు. గచ్చిబౌలిలో స్టేడియం కట్టిస్తే కాంగ్రెసు సమావేశాలకు వాడుకుంటోందని ఆయన విమర్శించారు. జైలుకు వెళ్లాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి తనను హెచ్చరిస్తున్నారని, తన 9 ఏళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై సభలో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. సిబిఐ విచారణ కూడా తన ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను తప్పు పట్టలేదని ఆయన అన్నారు. తనపై బురద చల్లాలని ప్రయత్నిస్తే అది వారి మీదే పడుతుందని ఆయన కాంగ్రెసు నాయకులను ఉద్దేశించి అన్నారు.


కాగా, తన కుమారుడిపై కూడా కాంగ్రెసు నాయకులు ఆరోపణలు చేశారని, తన కుమారుడి చదువుకు పెట్టిన ఖర్చులపై ఆ ఆరోపణలు చేశారని, తన అబ్బాయి  పేరు చెప్పి కూడా కోర్టుకు వెళ్లారని, తనను ఏమీ చేయలేకపోయారని చంద్రబాబు అన్నారు. చదువుకు పెట్టిన ఖర్చులకు సంబంధించిన పత్రాలను ఆయన స్పీకర్‌కు అందజేశారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ చదువుకు పెట్టిన ఖర్చులపై కాంగ్రెసు నాయకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దానిపై చంద్రబాబు ఆ వివరణ ఇచ్చారు.

By
en-us Political News

  
సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక చర్యలకు సిద్ధమవుతున్నారు.
హనుమకొండ జిల్లా కాజీపేటలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
గోదావరి తీరం వెంబడి ఉన్న దేవాలయాలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ప్రజలలో విస్తృతంగా ప్రజారం చేయడం ద్వారా విశేష ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించింది. అలాగే  బాసర నుంచి భద్రాచలం వరకు కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగం, అనుబంధ రంగాల కార్యకలాపాలు జోరందుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.  
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో అబార్షన్ కిట్ల అక్రమ విక్రయాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అత్యంత అరుదైన వైద్య కేసు వెలుగు చూసింది.
ఉమ్రి గ్రామానికి చెందిన కైలాస్ తన కుమార్తె కళ్యాణి ప్రేమ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయం బయటకు తెలిస్తే గ్రామంలో   కుటుంబ పరువు పోతుందన్న భయంతో  తన కన్నబిడ్డ 18 ఏళ్ల కళ్యాణిని హత్య చేశాడు.  అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, మృతదేహాన్ని ఇంటిలోని మరో గదిలోకి తీసుకెళ్లి ఉరివేసి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా  నమ్మించే ప్రయత్నం చేశాడు.  
ఐటీ కారిడార్‌తో పాటు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సైబరాబాద్ పరిధిలో పౌర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి శాశ్వత, సమీకృత భవనం అవసరమైంది. పర్యావరణ హితమైన నెట్-జీరో విధానంలో భవనాన్ని నిర్మించడం ద్వారా దీర్ఘకాలంలో నిర్వహణ, ఇంధన వినియోగంపై సానుకూల ప్రభావం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. అయినప్పటికీ భద్రత, తనిఖీల విషయంలో పోలీసులు ఇసుమంతైనా రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలు, వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి ఉద్యమ గాథ వెనుక ఎన్నో కన్నీళ్లు, ఎన్నో త్యాగాలు దాగి ఉన్నాయి.
తెలంగాణ పోలీస్ శాఖ ఆధునిక సాంకేతికత వినియోగంలో మరో కీలక ముందడుగు వేస్తోంది
తెలంగాణను అంతర్జాతీయ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
అమ్మకు బంగారం కొనివ్వాలనుకున్నాడు.. సైబర్ మోసం బలితీసుకుంది.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.