హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాను నిర్మిస్తున్న 'మహారాగ్ని' సినిమాకు పెట్టుబడిదారు లను పరిచయం చేస్తామని మొహ్సిన్ ఖాన్, తబ్రేజ్ హామీ ఇచ్చారని బాధితుడు సినీ నిర్మాత పేర్కొన్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, సినిమా కోసం భారీ పెట్టుబడులు సమకూ రుస్తామని నమ్మబలికి తన నుంచి మొత్తం రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.
ఇందులో మొహ్సిన్ ఖాన్‌కు రూ.25 లక్షలు, తబ్రేజ్‌కు మరో రూ.25 లక్షలు మూడు విడతల్లో నగదు రూపంలో అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే డబ్బులు తీసుకున్న తర్వాత పెట్టుబడిదారులను పరిచయం చేయకపోవడం తో పాటు, ప్రతి సారి ఏదో ఒక కారణం చెబుతూ కాలయాపన చేశారని బాధితుడు ఆరోపించాడు. దీంతో అనుమానం వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, కార్యాలయానికి రావాలని చెప్పి అక్కడ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో వివరించారు.
తనను బౌన్సర్లతో చుట్టుముట్టించి, ఆయుధాలు చూపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని, డబ్బులు అడుగుతావా... నీకు ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మొహ్సిన్ ఖాన్ బెదిరించాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా తనపై దాడి కూడా జరిగిందని, తబ్రేజ్ ఫోన్ ద్వారా పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొహ్సిన్ ఖాన్, తబ్రేజ్‌ల నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 126(2), 115(2), 352, 351(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణల్లో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయనే దానిపై ఆధారాలు సేకరిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/case-against-retired-ips-officer-ak-khans-son-36-224871.html
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో గురువారం తెల్లవారుజామున ఒక ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది.
కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు
పుణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
శ్రీకాకుళం తీరప్రాంతంలో అపారంగా లభ్యమవుతున్న బీచ్ శాండ్ మరియు హెవీ మినరల్స్ (భారీ ఖనిజాలు) ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న అంశాలు.
గల్ఫ్ దేశంలో ఉద్యోగాల కోసం 20 మంది మహిళలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వీరు విమానం ఎక్కబోతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా అధికారులు అత్యంత గోప్యంగా ఈ సోదాలు చేపట్టాయి.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శతాబ్ద కాలానికి పైగా ఎంతో పవిత్రంగా, చారిత్రక వారసత్వంగా విరాజిల్లుతున్న గురుద్వారాను కొందరు దుండగులు పాక్షికంగా కూల్చివేసి ధ్వంసం చేయడంపై సిక్కు సమాజమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇండియా కూడా తీవ్రంగా స్పందించి పాకిస్థాన్ తీరును గర్హించింది.
మణిపూర్‌లోని కమ్‌జాంగ్ జిల్లా సరిహద్దు గ్రామాలు బుధవారం (జులై1) హింసాత్మక ఘర్షణలు, పరస్పర దాడులలతో దద్దరిల్లిపోయాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
జడ శ్రవణ్ కుమార్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నాలుక కోసి దానిని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పార్సిల్ పంపిస్తానంటూ అభ్యంతరకరమైన,అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.
అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారీ స్కోరు సాధించినప్పటికీ, వరుణుడు విరుచుకుపడటంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
చాలా కాలంగా ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన అధికారిక, అనధికారిక దౌత్య మార్గాలను మళ్లీ తెరిచి, అన్ని సమస్యలపై ప్రత్యక్ష సంప్రదింపులకు తక్షణమే శ్రీకారం చుట్టాలని ఈ ప్రముఖులు ఆ లేఖలో ఇరు దేశాల ప్రముఖులకు విజ్ణప్తి చేశారు.