రుషి కొండ ప్యాలెస్ వినియోగం ఎలా.. కేబినెట్ సబ్ కమిటీ తుది సమావేశం తేలుస్తుందా?

Publish Date:Jun 17, 2026

Advertisement

విశాఖపట్నంలోని అందమైన రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ,  గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన   ప్యాలెస్  భవితవ్యం  ఏమిటో తేలిపోనున్నది.  రిషికొండ ప్యాలెస్  లగ్జరీ భవనాల వినియోగం,  ఆదాయాన్ని రాబట్టడం ఎలా?  అన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ   కసరత్తు తుది దశకు వచ్చింది. విశాఖలోనే   మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది.  మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా వచ్చిన ప్రతిపాదనలను, నివేదికలను  పరిశీలించింది. బుధవారం జరిగే  భేటీలో అధికారుల అభిప్రాయాలను సేకరించి, భవనాల వాడకంపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం..  వచ్చే కేబినెట్ మీటింగ్‌లోనే  కమిటీ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  

అసలు రుషికొండ భవన నిర్మాణాల వెనుక ఉన్న లెక్కలు, వివాదాల విషయానికి వస్తే..  జగన్ హయాంలో.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో   453 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ  ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఇంత భారీ స్థాయిలో ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఈ ప్యాలెస్‌ను వృథాగా వదిలేయకుండా..  వీలైనంత త్వరగా ప్రజా వినియోగంలోకి.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే..  ప్రభుత్వ ఆదాయ మార్గాల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీటీడీసీ   కూడా ఈ భవనాల నిర్వహణ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. ఈ భవన సముదాయంతో పాటు, దాని పక్కనే ఖాళీగా ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా లీజుకు ఇస్తామని ప్రకటించడంతో దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పోటీ పడ్డాయి.

ప్రముఖ తాజ్ గ్రూప్, విశాఖలో ఇప్పటికే బేపార్క్‌ను నిర్వహిస్తున్న ఫెమా గ్రూప్, అంతర్జాతీయ స్థాయి అట్మాస్పియర్ కోర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ ప్యాలెస్ దక్కించుకోవడానికి బిడ్లు దాఖలు చేశాయి. అయితే..  ఇక్కడే ఒక అనూహ్య ట్విస్ట్ ఎదురైంది. ఈ భవనాలను ఒక లగ్జరీ హస్పిటాలిటీ లేదా హోటల్ రంగం వైపు తిప్పాలని కమిటీ భావించినప్పటికీ..  అంతర్జాతీయ హోటల్స్ గ్రూప్స్ మాత్రం ఈ నిర్మాణాలు నేరుగా హోటల్ వ్యాపారానికి అనువుగా లేవని తేల్చి చెప్పాయి. ఈ ప్యాలెస్‌లో భారీగా మార్పులు చేర్పులు చేయాలని, లేదా మరికొన్ని కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇస్తేనే తాము ముందుకు వస్తామని అన్నాయి.

అంతేకాకుండా.. ఏపీటీడీసీ ఆఫర్ చేసిన 9 ఎకరాల ఖాళీ స్థలంలో దాదాపు 7 ఎకరాల భూమి కోస్తా నియంత్రణ జోన్ అంటే సీఆఆర్ జడ్  పరిధిలోకి వస్తుందని అధికారులు గుర్తించారు. దీనివల్ల అక్కడ కొత్త నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు రావడం కష్టం. దీంతో.. నిబంధనలను ఉల్లంఘించకుండా ఏ మేరకు మార్పులు చేయవచ్చు, ఏ రకమైన ప్రతిపాదనలు ఆచరణ సాధ్యమవుతాయనే కోణంలో సబ్ కమిటీ  అధ్యయనం చేస్తోంది.  ఈ కమిటీ సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబునాయుడికి సమర్పిస్తుంది.  ఆ తరువాతనే రుషికొండ ప్యాలెస్ భవిష్యత్ ఏమిటన్నది తేలుతుంది. 

By
en-us Political News

  
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై  కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.