అహ్మదాబాద్ సీరియల్ పేలుళ్ల కేసు.. 38 మందికి మరణశిక్ష ఖరారు చేసిన గుజరాత్ హైకోర్టు.!

Publish Date:Jul 7, 2026

Advertisement

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన 2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు మంగళవారం (జూలై 7) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో 38 మంది దోషులకు మరణశిక్ష, మరో 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ 2022లో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పూర్తిగా సమర్థించింది. దోషులు దాఖలు చేసిన అన్ని అప్పీళ్లను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఎ.వై. కోగ్జే, జస్టిస్ సమీర్ దవేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు   తుది తీర్పు  వెలువరించింది. భారత న్యాయ చరిత్రలో ఒకే కేసులో ఇంత పెద్ద సంఖ్యలో నిందితులకు మరణశిక్షను ఉన్నత న్యాయస్థానం ఖరారు చేయడం ఇదే మొదటిసారి. 
 
2008 జూలై 26న గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. గంటా పది నిముషాల వ్యవధిలో నగరంలో  నగరంలోని 20 వేర్వేరు ప్రాంతాలలో 21 బాంబులు పేలాయి. ఈ ఉగ్రదాడిలో 56 మంది  ప్రాణాలు కోల్పోగా, 240 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా క్షతగాత్రులను తరలించే ఆసుపత్రులను కూడా లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ  ఇండియన్ ముజాహిదీన్  ఈ దాడులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు, 2022 ఫిబ్రవరిలో సంచలన తీర్పు ఇచ్చింది. మొత్తం 49 మందిని దోషులుగా తేల్చింది. వారిలో 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ శిక్షల నిర్ధారణ కోసం,  నిందితులు పెట్టుకున్న అప్పీళ్లపై గత కొన్ని నెలలుగా గుజరాత్ హైకోర్టులో విచారణ సాగింది. ప్రత్యేక కోర్టు ఇచ్చిన 7,015 పేజీల సుదీర్ఘ తీర్పును, ఆధారాలను పరిశీలించిన హైకోర్టు.. దిగువ కోర్టు ఇచ్చిన శిక్షలు సరైనవేనని స్పష్టం చేసింది. శిక్ష పడిన వారిలో సిమి మాజీ నేత సఫ్దర్ నాగోరితో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్ తదితర 11 రాష్ట్రాలకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారు.  

11lifeinprision, sensational, verdict, 2008serial blast case, Teluguone

By
en-us Political News

  
నరసరావుపేట వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక క్రెడిట్ అవుట్ రీచ్ బహిరంగ సభలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలోని దాదాపు లక్షా 3వేల మందికి పైగా లబ్థిదారులకు 3 వేల 216 కోట్ల భారీ రుణాలను చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల సమీకరణాలు, ప్రాంతీయ భావోద్వేగాల చుట్టూనే తిరుగుతుంటాయి.
రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో ఆడే అవకాశం ఇసుమంతైనా లేదు. వయసు రీత్యానే కాకుండా ఫామ్ విషయంలో కూడా రోహిత్ ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసే అవకాశం ఇసుమంతైనా లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లండన్ వేదికగా రోహిత్ శర్మకు ఒక ప్రత్యేకమైన, ప్రతిష్టాత్మకమైన వీడ్కోలు ఇచ్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్ నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
ఇటీవల సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలు కేవలం ఒక కుటుంబంలో జరిగిన విషాదం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, . యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య మొదలైన కొత్త ఘర్షణ పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్.. తన స్వార్థపూరిత వ్యూహాల వల్ల ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక నిండా మునిగిపోతోంది.
కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత ఘోరమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది.
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
వైఎస్సా ర్సీపీ నేత నాగార్జున యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది
భారీ రుణమేళా ద్వారా పల్నాడు జిల్లా వ్యాప్తంగా లక్షా మూడు వేల 246 మంది లబ్ధిదారులకు 3 వేల 216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జిల్లా పరిధిలో ఇంత భారీ స్థాయిలో బ్యాంకింగ్ రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ ఆర్థిక సాయం అందించడం ఒక రికార్డుగా నిలిచింది.
భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది.
ప్రస్తుతానికి కోవిడ్ బారిన పడిన వారిలో ముగ్గురు రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరే కాకుండా, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.