విజయసాయితో సజ్జలకు చెక్ : కేబినెట్ ఎఫెక్ట్

Publish Date:Apr 19, 2022

Advertisement

మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం పార్టీలో చెలరేగిన అసంతృప్తి సెగలు ఇంకా పూర్తిగా చల్లారనే లేదు...అప్పుడే మరో పదవుల పందేరానికి ఏపీ సీఎం జగన్ తెరలేపారు. ఈ సారి పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల పందేరం చేయనున్నారు. మంత్రి పదవులు దక్కక అసంతృప్తితో ఉన్నవారిని నామినేటెడ్ పదవులతో సంతృప్తి పరచాలన్నది ఆయన ఉద్దేశం. అయితే ఆశావహుల సంఖ్య అసంఖ్యాకంగా ఉండటంతో నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలన్న కసరత్తు ఓ కొలిక్కి చేరలేదు. నేడో రేపో కసరత్తు పూర్తి చేసి తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో జగన్ కు అంతా తానై సహకరించిన రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిని మాత్రం ఈ సారి దరిదాపులకు రానీయకుండా జగన్ నామినేటెడ్ పోస్టుల జాబితా రూపొందించడం నుంచి ఎవరెవరికి పదవులు ఇవ్వాలన్న విషయంపై పూర్తిగా పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనే ఆధారపడుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ ఉత్తరాంధ్రకే పరిమితమైన ఆయనను ఇప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకువచ్చి మరిన్ని బాధ్యతలు అప్పగించే యోచనలో జగన్ ఉన్నారు. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలతో పార్టీ ప్రతిష్ట మసకబారిందని జగన్ భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆయన పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలను అంచనా వేయడంలోనూ, అసమ్మతి రాగాలను అదుపు చేయడంలోనూ సజ్జల విఫలం కావడం వల్లే స్వయంగా తానే రంగంలోనికి దిగాల్సిన పరిస్థితి వచ్చిందని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందుకే సజ్జలను పక్కన పెట్టి విజయసాయిరెడ్డిని మరింత క్రియాశీలంగా పార్టీ వ్యవహారాలలో నిమగ్నమయ్యేలా చేయాలన్నది జగన్ ఉద్దేశంగా కనిపిస్తున్నది. 
గతంలో జగన్ హస్తిన పర్యటన సందర్భంగా పీఎంతో అప్పాయింట్ మెంటు విషయంలో విజయసాయి రెడ్డి సఫలం కాలేకపోవడంతో ఆయన ప్రాధాన్యతను పార్టీలో తగ్గించినట్లు కథనాలు వచ్చాయి. వాటిలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా గత కొంత కాలంగా పార్టీలో విజయ సాయి రెడ్డికి పెద్దగా ప్రాధాన్యత అన్నది కనిపించలేదు. రాజకీయ సలహాదారు హోదాలో సజ్జలే అన్నీ చక్కబెడుతూ వస్తున్నారు. మంత్రులను మించి ఆయన వివిధ శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహించడం, విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించడం వంటివన్నీ సజ్జలే చూసుకుంటూ వచ్చారు. మంత్రులను డమ్మీలుగా మార్చి సజ్జలే అన్నీ తానై వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తిన ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు. సజ్జలను నియంత్రించడానికి ప్రయత్నించలేదు. 
 అయితే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలతో సజ్జల వన్ మేన్ షో వల్ల జరిగిన నష్టం ఏమిటన్నది తేటతెల్లమవ్వడంతో ఆయన ప్రాధాన్యత తగ్గించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు విజయసాయి రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాయానికి రప్పించి కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ నిర్ణయించుకోవడాన్ని బట్టి అర్థమౌతున్నది. మొత్తం మీద సీఎం జగన్ పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల ప్రాధాన్యతకు చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో విజయసాయిరెడ్డి జగనే తాను తానే జగన్ అన్న చందంగా వైసీపీలో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత క్రమంగా ఆయన పాత్రను నామమాత్రం చేసిన జగన్...విజయసాయి స్థానంలో రాజకీయ సలహాదారుల ఉన్న సజ్జలకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయనను కాదని విజయసాయికి ప్రాధాన్యత పెంచాలని నిర్ణయించుకున్నారు.   నామినేటెడ్ పదవుల జాతరకు సజ్జలను దూరం పెట్టడంతోనే ఆయన ప్రభ ఇంక పార్టీలో మసకబారినట్లేనని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల పందేరం అనంతరం పార్టీలో మరోసారి అసంతృప్తి జ్వాలలు ఎగసిపడే అవకాశం ఉండొచ్చన్నది పరిశీలకుల అంచనా. గతంలోలా జగన్ మాటే శిరోధార్యం అన్న పరిస్థితి పార్టీలో కనిపించడం లేదనీ, పునర్వ్యవస్థీకరణ అనంతర పరిణామాలే అందుకు నిదర్శనమనీ చెబుతున్నారు. మరి పార్టీలో అసమ్మతిని, అసంతృప్తిని విజయసాయి రెడ్డి ఏ మేరకు నియంత్రించగలరన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.