Publish Date:Apr 18, 2022
పదవి పోయింది. పరపతీ పోయింది. పరువూ పోయింది. పనిలేక ఖాళీగా ఉంది. ఏం చేస్తాం.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అయితాయా ఏం.. అంటూ దిగాలుగా ఉంటోంది. ఊరికే ఉంటే ఏమీ తోచదుగా. ఖాళీగా ఉంటే అందరికీ లోకువేగా. అసలే, కరెంట్ కోతలు.. విసనకర్రతో ఊపుకొని ఊపుకొని.. విసుగొచ్చినట్టుంది. కాసేపు అలా పొలంబాట పట్టింది. గతంలో తాను ఏపీకి ఉప ముఖ్యమంత్రిని అనే విషయం పక్కన పెట్టేసింది. ఆడుతూ పాడుతూ పని చేస్తూ.. తోటలో కూరగాయలు కోస్తూ.. గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించారు మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి. ఆ ఫోటోలను స్వయంగా ఆమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ పిక్స్ వైరల్ అయ్యాయి. కొందరు మంత్రి చేసిన పనిని మెచ్చుకుంటుంటే.. సెటైర్లు, విమర్శలూ ఓ రేంజ్‌లో వస్తున్నాయి.
పుష్ప శ్రీవాణి ఫాంహౌజ్‌లో గంపలో టమోటాలు ఏరుకుంటూ ఉందో ఫోటో. మరో ఫోటోలో మొక్కలకు నీళ్లు పడుతూ కనిపించారు. మంత్రి పదవి పోయిందనే బాధను.. ఇలా కూరగాయ మొక్కల పెంపకంతో మర్చిపోతున్నట్టున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి.
విజయనగరం జిల్లాలోని కురుపం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పుష్ప శ్రీవాణి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెకు కేబినెట్‌లోకి తీసుకొని.. ఏకంగా డిప్యూటీ సీఎంను చేశారు. ట్రైబల్ వెల్ఫేర్ బాధ్యతలు అప్పగించారు. పని తీరు బాగాలేదో.. శ్రీవాణిని మంత్రిని చేసినా ఉపయోగం లేదనుకున్నారో.. కారణం ఏదైనా కేబినెట్ నుంచి తీసేశారు జగనన్న. పదవి పోయిన బాధలో అమరావతి నుంచి సొంతజిల్లాకు వచ్చేశారు. పదవి పోయాక ఇక పనేముంటుంది.. ఫుల్ ఖాళీ. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రజా సేవ చేయాలని, నిత్యం ప్రజలను కలుస్తూ, వారి సమస్యలు వింటూ నెరవేరుస్తూ ఉండాలనే గ్యారెంటీ ఏమైనా ఉందా? అందుకే, ప్రజలను వారి మానాన వారిని వదిలేసి.. కరెంట్ కోతలు, చార్జీలు పెంపుల బాదుడే బాదుడుతో తనకేం సంబంధం లేదన్నట్టు.. ఎంచక్కా కూరగాయలు మొక్కలతో ఇలా సేద తీరుతున్నారు పుష్ప శ్రీవాణి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pushpa-srivani-in-agri-field-39-134587.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.