Publish Date:Apr 19, 2022
ఏపీ సీఎం ఏ ముహూర్తంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారో గానీ.. ఆ రోజు నుంచీ నెల్లూరు జిల్లాలో వైసీపీలో రచ్చ మొదలైంది. జిల్లాలోని వైసీపీ నేతలు ఒకే రోజు ఒకే సమయంలో విడివిడిగా సమావేశాలు నిర్వహించే దాకా విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇటీవలి కేబినెట్ లో కొనసాగింపు లేకుండా మాజీగా మారిన అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ మంత్రి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి- ఆనం రామనారాయణరెడ్డిగా ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయంటున్నారు. ఈ విభేదాలు ఎక్కడి దాకా వెళ్లాయంటే.. నగరంలో వేస్తున్న వైసీపీ నేతల ఫ్లెక్సీలను చింపి పారేసే దాకా సమస్య వెళ్లింది. దీంతో నెల్లూరు నగరంలో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కొద్ది రోజుల క్రితం మంత్రి పదవి చేపట్టిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగతం ప్లెక్సీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చింపి పారేశారు. మంత్రి కాకాని, మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పోటోలతో ఉన్న ఫ్లెక్సీలు నెల్లూరు నగరం అంతా ఏర్పాటు చేశారు. అయితే.. వాటిని తొలగించడం వెనుక తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రోద్బలం ఉందంటూ ఆనం, కాకాని వర్గీయులు బహిరంగంగానే ఆరోపించారు. అనిల్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఇలా ఉండగా.. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బర్త్ సందర్భంగా నెల్లూరు నగరంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి ఎవరో చింపేశారు. మంగళవారం నాడు ప్రభాకర్ రెడ్డి బర్త్డే. అయితే.. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చింపేసినట్లు చెబుతున్నా.. ఈ చర్య వెనుక కూడా అనిల్ కుమార్ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను మంగళవారం మళ్లీ ఏర్పాటు చేశారు.
ఒకటే పార్టీలో ఉంటున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలను చింపేస్తుండడం గర్హనీయమని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. నెల్లూరు నాయకుడి ప్రోద్బలంతోనే కొందరు పోకిరీలు ఇలా ఫ్లెక్సీలను చింపేస్తున్నారని భయపడుతున్నారు. కొందరు పోకిరీల కారణంగా నెల్లూరు నగరంలో ముందు ముందు దారుణమైన పరిస్థితితులు చూడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటితో ఈ దుశ్చర్యలను ఆపకపోతే ఇలాంటి దురాగతాలు జిల్లా మొత్తం చుట్టుకునే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flexi-war-in-nellore-39-134595.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.