Publish Date:Jun 15, 2012
రాష్ట్రంలో 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాలు ఇటీవల తెలుగువన్ డాట్ కామ్ అంచనా వేసిన విధంగానే వచ్చాయి. 18 అసెంబ్లీ ఎన్నికల్లో 14 చోట్ల వై.ఎస్.అర్.కాంగ్రెస్ అభ్యర్దులు గెలుపోందడం ఖాయమని నాలుగుచోట్ల హోరాహోరీ పోటీ ఉంటుందని వీటిలో మరో ఒకటి లేదా రెండు చోట్ల వై.ఎస్.అర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులకే చాన్స్క్ష్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుగువన్ డాట్ కామ్ పోలింగ్ ముగిసిన వెంటనే తెలిపింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే వై.ఎస్.అర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు 15 స్థానాల్లో గెలుపొందారు.ఈ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ బాగా పనిచేసిందని, జగన్ పై కాంగ్రెస్,టి.డి.పిలు చేసిన అవినీతి ఆరోపణలు వోటర్లు పట్టించుకోలేదని కూడా తెలుగువన్ డాట్ కామ్ స్పష్టం చేసింది.తెలుగువన్ డాట్ కామ్ అంచనా వేసినట్లు గానే వోటర్లు జగన్ పై అవినీతి ఆరోపణలు పట్టించుకోలేదని తేలింది. తిరుపతిలో చిరంజీవి ప్రభావం పనిచేయదని,వాయిలార్ రవి,గులాం నబీ అజద్ చేసిన ఎన్నికల ప్రచారం వల్ల కాంగ్రెస్ కు ఎటువంటి ప్రయోజనం ఉండదని,నాలుగైదు చోట్ల ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కూడా తెలుగువన్ డాట్ కామ్ తెలిపింది.ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఉప ఎన్నికల్లో ఐదు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్దులు డిపాజిట్లు కోల్పోయారు.
నెల్లూరు లోక్ సభ ఉప ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని కూడా తెలుగువన్ డాట్ కామ్ ముందే అంచనా వేసింది. ఈ అంచనాలకు తగ్గట్టుగానే మేకపాటి సుమారు 2.91 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమార్పులు ఉంటాయని, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినా ఆశ్చర్యపోనక్కర లేదని తెలుగువన్ డాట్ కామ్ అంచనా వేస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/by-polls-2012-24-14913.html
Publish Date:Oct 10, 2026
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు