షర్మిల, విజయమ్మలదే ఈ విజయం

Publish Date:Jun 15, 2012

Advertisement

ఉపఎన్నికల ఫలితాలు ఇటు కాంగ్రెస్ కు, అటు తెలుగుదేశంపార్టీకి తీవ్ర నిరాశకు మిగిల్చాయి, జగన్ ను జైల్లో పెట్టడం ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ది పొందవచ్చనుకున్న కాంగ్రెస్ ఆశలపై వై.ఎస్. రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల అడియాశలు చేశారు. జగన్ అరెస్ట్ అయిన వెంటనే వీరిద్దరూ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. విజయమ్మ ఎన్నికల ప్రచారం చేస్తారని కాంగ్రెస్ నాయకులు ముందుగానే ఊహించారు. అయితే ఆమె వెంట షర్మిల కూడా ఉండడంతో వారు ఖంగుతిన్నారు. నిజానికి విజయమ్మ వక్త కాదు. జనాన్ని ఆకట్టుకునే విధంగా ఆమె ఏనాడూ ప్రసంగాలు కానీ, ఎన్నికల ప్రచారం కానీ చేయలేడు. ఆమె ఎన్నికల ప్రచారం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని మొదట కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు అంచనా వేశారు. అయితే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా విజయమ్మకు, షర్మిలకు సుమారు రెండు నెలలపాటు నిపుణులైన ఉపన్యాసకులచే నిత్యం శిక్షణ ఇప్పించారు. ఈ శిక్షణ వారిద్దరికి ఎంతగానో ఉపయోగపడింది. ఎన్నికల ప్రచార మొదటి సభలోనే వీరు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచారం చేశారు. విజయమ్మ ప్రజల సానుభూతిని పొందే విధంగా ప్రసంగాలు చేయగా, షర్మిల ఓటర్లను ఆలోచన రేకెత్తించే విధంగా ప్రచారం చేశారు. తమ కన్నీరును చూసి అవహలన చేస్తున్న వారికి ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలంటూ చేసిన ప్రసంగాలకు ప్రజలనుంచి మంచి స్పందన లభించింది. తడబాటు లేకుండా, ఆవేశానికి లోనుకాకుండా వీరు చేసిన ప్రసంగాలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మెజార్టీని మెరుగుపరచడానికి దోహదపడ్డాయి. జగన్ అరెస్ట్ తో డీలా పడ్డ అభ్యర్థులు ఇప్పుడు తమ విజయం షర్మిల, విజయమ్మలదే అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో  ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి  అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల  వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న  నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో  వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో  నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో  నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం  7,635.22 కోట్ల  రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన  2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.