శ్రీరాములు బిఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ నమోదు
Publish Date:Jan 11, 2012
Advertisement
బెంగళూరు: తాము బిఎస్ఆర్ కాంగ్రెసు పార్టీని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించామని ఓబుళాపురం మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్ధన్ రెడ్డి సన్నిహితుడు, మాజీ మంత్రి శ్రీరాములు మంగళవారం బళ్లారి తాలుకాలో మీడియాతో చెప్పారు. బిఎస్ఆర్ అంటే బడవ శ్రామిక రైతు అని అర్థం. ఈ నెల పదిహేనవ తారీఖు నుండి బీదర్ జిల్లా నుంచి ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తానని చెప్పారు. కాగా ఇటీవల ఉప ఎన్నికల్లో బళ్లారి రూరల్ నియోజకవర్గం నుండి గెలిపొందిన శ్రీరాములు గాలి వర్గీయుడు.అయన పలుమార్లు హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఉన్న గాలి జనార్దన రెడ్డిని కలిశారు. ఇటీవల కూడా ఆయనను గాలిని కలిశారు. శ్రీరాములు బిజెపికి రాజీనామా చేసినప్పటి నుండి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలు వినిపించాయి. అనంతరం శ్రీరాములు కూడా పలుమార్లు కొత్త పార్టీ పెడతామని, కొత్త పార్టీ పెట్టాక రాష్ట్రమంతటా పర్యటిస్తానని ప్రకటనలు చేశారు.
http://www.teluguone.com/news/content/bsr-congress-party-24-10850.html





