Publish Date:Aug 15, 2022
బడికి వెళ్లేవాడు టీచర్ ఏమడు గుతుందా అని భయపడతాడు. హోంవర్క్ చూపినా నువ్వే చేశావా? అని వెయ్యి అనుమానాలతో రెండు ప్రశ్నలన్నా అడుగుతుంది టీచర్. అందుకే లెక్కల పుస్తకంలో లెక్క, హోంవర్క్ చేసినది ఒకటేనని చూప డానికి ఓ పిల్లాడు వాళ్లమ్మ చేత ఫోన్ చేయించి మరీ చెప్పించా డట. అప్పుడుగాని ఆ టీచర్ నమ్మ లేదు. అదుగో అలాంటి ప్రశ్న లతో చంపు తారనే రామేంద్ర యాదవ్ ఓ చిన్న ప్లాస్టిక్ బాటిల్లో ఏకంగా చిన్న పామును బంధించి మరీ డాక్టర్ దగ్గరికి తీసికెళ్లాడు. వాళ్ల ప్రిస్క్రిప్షన్ లా వారి ప్రశ్నలు బొత్తిగా అర్దంగావుగదా.. అందుకని!
ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలో రౌఅఫ్జల్ నగర్ రామేంద్ర యాదవ్ నివాసం. ఆమధ్య ఒక రోజు ఆయన భార్య ఇంటి పెరట్లో పని చేస్తుండగా ఓ పాము వచ్చి కాటేసింది. అంతే ఆమె విలవిలలాడిపోయింది. ఆమె అరుపులకు యాదవ్ వచ్చి చూసేసరికి ఆమె పడిపోయి ఉంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసికెళ్లబోయాడు. అంతలో పాము అక్కడికి దగ్గరలోనే ఉండడం చూశాడు. దాని నెత్తిన ఒక్కటి కొట్టి ఓ ప్లాస్టిక్ సీసాలో పెట్టి బూచాడిని బంధించినట్టు చేసి ఆ సీసాతో పాటు ఆస్పతికి భార్యను తీసికెళ్లాడు.
ఆయన హడావుడి చూసి డాక్టరు వచ్చి ఏమయిందని అడిగాడు. పాము కాటు వేసింది. వెంటనే వైద్యం చేయండిబాబా, లేకుంటే చనిపోతుందేమో అని భయంతో వేడుకున్నాడు. డాక్టరు ఇంకా ఏదో అడగబోయాడు. అంతలో సీసాలో ఉన్న పాముని చూపిం చాడు. అది చూసి డాక్టర్ ఖంగారుపడి అదెందుకు తెచ్చావయ్యా సామీ.. అని అడిగాడు. అబ్బే ఏంలేదు, పాము కరిచింది అన గానే అది ఏ పాము, దాని జాతేందీ.. అడుగుతారు గదా.. అందుకే చూపిస్తే సరిపోద్దని తెచ్చా సార్! అన్నాడు చక్కగా సీసాలో కదులుతున్నా పామును చూపించి. అయితే సీసాలోని పాము చావకుండా గాలి లోపలికి వెళ్లేలా రంధ్రాలు చేశాడు అదీ చిత్రం. అతని భార్యకి వైద్యంచేశారు. ఆమె బతికింది. యాదవ్ ఆ పామును అడవిలో వదిలేశాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brought-snake-to-hospital-for-proof-39-141957.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?