బ్రదర్ అనిల్ దెబ్బ కొడాలి నాని అబ్బా

Publish Date:Apr 29, 2022

Advertisement

జగన్ కొత్త కేబినెట్‌లో పాత వారు ఎవరు ఉన్నా.. లేకున్నా.. కొడాలి నాని మాత్రం పక్కాగా ఉంటారంటూ ఓ టాక్ అయితే అటు మీడియాలో..... ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అంతేకాదు.. జగన్ కేబినెట్‌లో తాజాగా మాజీలు అయిన వారంతా కూడా కొడాలి నానికి మళ్లీ కేబినెట్ మినిస్టర్ పదవి ఫిక్స్ అనే మాటకు ఫిక్స్ అయిపోయారు. అయితే కొడాలి నాని మరో రెండేళ్ల పాటు మంత్రిగా ఉంటారంటూ ఆయన ఫ్యాన్స్... గుడివాడ యూత్ కూడా పక్కాగా ఫిక్స్ అయిపోయింది. నూటికి నూరు శాతం ఇదే జరుగుతోందని కొడాలి నాని కోటరీ సైతం నమ్మేసింది. 


కానీ జగన్ తన పాత కేబినెట్‌లోని ఎవరి ఎవరినో ఉంచి.. కొడాలి నానికి మాత్రం తొలగించడం .. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారట. చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ అంటే చాలు... కొడాలి నానిని నిద్రలో లేపి.. అప్పటికప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడించినా.. బూతుల పంచాంగం అందుకుంటారన్న విషయం అందరికి తెలిసిందే. మరి అలాంటి కొడాలి నానిని తొలగించడం వెనుక ఏమైన మంత్రాంగం జరిగిందా? అని సందేహం గుడివాడ నియోజకవర్గ ప్రజల మదిని తెగ తొలిచేస్తోందట. పోని కొడాలి నానిని తొలగించారు సరే.. ఆ స్థానంలో మళ్లీ అదే సామాజికవర్గం వారిని ఎవరినైనా సీఎం జగన్ నియమించారా? అంటే అదీ లేదు. అయితే కొడాలి నాని పదవి ఊస్టింగ్ కావడం.. జగన్ తన కొత్త కేబినెట్‌లో ఆదే సామాజిక వర్గం వారిని నియమించకపోవడం వెనక చాలా పెద్ద తతంగమే నడించిందనే ఓ టాక్ అయితే గుడివాడ నియోజకవర్గంలో తాజాతాజాగా హాట్‌హాట్‌గా హల్‌చల్ చేస్తోంది.

కొడాలి నానికి సీఎం జగన్ చెక్ పెట్టడం వెనుక.... వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ హస్తం ఉందట. ఇటీవల బ్రదర్ అనిల్.. విజయవాడ, విశాఖపట్నం వేదికగా వివిధ మైనార్టీ వర్గాల వారితో వరుసగా భేటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారంతా.. కొడాలి నాని వ్యవహారంపై బ్రదర్ అనిల్‌కు పూసగుచ్చినట్లు వివరించారట. కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి.... చంద్రబాబు, నారా లోకేశ్‌లను ఎంత చెడామడా తిట్టినా.. మళ్లీ ఆ సామాజికవర్గం వారికే.. అదీ కూడా పార్టీలకతీతంగా పనులు చేస్తున్నారనే విషయాన్ని బ్రదర్ అనిల్ చెవిలో ఊదినట్లు సమాచారం.  ఆ తర్వాత ఈ విషయాన్ని బ్రదర్ అనిల్ తాడేపల్లి ఫ్యాలెస్‌లోని కీలక నేతల్లో ఒకరిద్దరికి  వివరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ తన కొత్త కేబినెట్‌లో కొడాలి నానికి బర్త్ కన్‌ఫార్మ్ చేయలేదట. అంతేకాదు.. కొడాలి నాని సామాజికి వర్గం వారికి సైతం మొండి చేయచూపారనే ఊహగానాలు కూడా గుడివాడ నియోజకవర్గంలో జోరుగా ఊపందుకున్నాయి.

చంద్రబాబు అండ్ కోతోపాటు ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌ అంటూ కొడాలి నాని ప్రెస్‌మీట్ పెట్టి మరీ బండ బూతులు తిడతారీ కొడాలి నాని. అదీకాక.. చంద్రబాబును ఆ రేంజ్‌లో తిట్టగల మొనగాడు.. ఇంకా చెప్పాలంటే.. ఒకే ఒక్కడు కొడాలి నాని అనే ఓ బలమైన ముద్ర ఫ్యాన్ పార్టీలో బలంగా ఉంది. అలాంటి కొడాలి నానిని సీఎం జగన్ తొలగించడం వెనుక బ్రదర్ అనిల్ హస్తం అంటూ ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే జరిగి ఉండవచ్చునని వారు పేర్కొంటున్నారు.  

కొడాలి నానినీ మంత్రి పదవి నుంచి తొలగించే ఉద్దేశ్యం సీఎం జగన్‌కు ఏ కోశానా లేదన్న సంగతి ఆ పార్టీలోని వారందరికీ తెలిసిందే. మరి కొడాలి నానికి జగన్ కొత్త కేబినెట్‌లో కొలువు ఉంటుందని అంతా భావించిన తరుణంలో.. ఆయనకు పక్క పెట్టడం వెనక ఏదో జరిగి ఉంటుందనే భావనలో ఉన్న ప్రజలకు బ్రదర్ అనిల్ వ్యవహారంతో సమాధానం దొరికినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతుండడం గమనార్హం.

By
en-us Political News

  
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.