తెలుగుదేశం గూటికి పురంధేశ్వరి కుమారుడు.!

Publish Date:Aug 12, 2026

Advertisement

ఏపీ పాలిటిక్స్ లో  ఆసక్తికరమైన  పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మనవడు, పురందేశ్వరి కుమారుడు   దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.  నందమూరి, దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో..  హితేష్ చెంచురాం టిడిపి కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 

తెలుగుదేశం  ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పుడు తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు హితేష్ తెలుగుదేశం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టనున్నారు.   కుటుంబ బంధాలు,  రాజకీయ వేదికలు ఏకతాటిపైకి రావడం పార్టీలో నూతనోత్తేజాన్ని నింపుతుందని పరిశీలకులు అంటున్నారు.  లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దగ్గుబాటి హితేష్   రాజకీయ ప్రవేశం వెనుక కుటుంబ పెద్దల సహకారం, పొత్తుల సమీకరణాలు   ఉన్నాయని అంటున్నారు. గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా దగ్గుబాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  చంద్రబాబు నాయకత్వంలో  తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేసేందుకు  హితేష్ ను తెలుగుదేశంలో చేర్చడం ద్వారా ఈ దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. బాపట్ల జిల్లా కారంచేడు పరిధిలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హితేష్ క్రియాశీలకంగా పాల్గొన్నారు.  అలాగే స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి సొంతంగా నిధులు కేటాయించడం వంటి అంశాలు ఆయన రాజకీయ ప్రవేశానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

2019 శాసనసభ ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ఆయన కుమారుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ పోటీ చేయాలని భావించినప్పటికీ,  సాంకేతిక సమస్యల కారణంగా ఆయన స్థానంలో తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. ఆ ఎన్నికల అనంతరం దగ్గుబాటి తండ్రీకొడుకులు వైసీపీకి,   రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా..  దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగుతూ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇటీవలి కాలంలో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం  పెరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లడం, కుటుంబ వేడుకలు,  పుస్తకావిష్కరణల సందర్భంగా చంద్రబాబు, దగ్గుబాటి ఒకే వేదిక పంచుకోవడం వారి మధ్య దూరం తగ్గిపోయిందనడానికి సాక్ష్యంగా నిలిచాయి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ మూడు కుటుంబాల మధ్య  బంధం మరింత బలపడింది. ఈ సఖ్యతే హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీలో చేరడానికి  మార్గం సుగమం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Hitesh Chenchuram TDP Entry, Daggubati Hitesh Chenchuram, NTR Grandson Political Entry, TDP New Political Developments,  Daggubati Family, TeluguOne

By
en-us Political News

  
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.