నాటికన్న నేడు బెటర్ : బొత్స

Publish Date:Jan 22, 2012

Advertisement

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నా ప్రతిపక్షాలు అనవసరంగా బురద జల్లుతున్నాయనీ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ  అన్నారు. నాడు 2009లో ఉన్న ప్రభుత్వం కన్నా ప్రస్తుతం సంక్షేమ పథకాల కోసం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని  అవసరమైతే ఈ అంశంపై శ్వేత పత్రం విడదల చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ భేటీ రెండో సమావేశం గాంధీభవన్‌లో  జరిగింది.  మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశ వివరాలను బొత్స మీడియాకు  వివరించారు.  టిడిపి అధినేత చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిపై బొత్స విరుచుకు పడ్డారు.జగన్, చంద్రబాబు అబద్ధాలకు పేటెంట్లు పొందారన్నారు.  2009 తర్వాత రైతులకు కష్టాలు మొదలయ్యాయని జగన్ చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల వారికి కూడా సంక్షేమ పథకాలను చేర్చడానికి కృషి చేస్తున్నామని వివరించారు. వైఎస్ ప్రభుత్వం కన్నా ప్రస్తుత ప్రభుత్వమే సంక్షేమ పథకాలకు అధికంగా ఖర్చు పెడుతోందని బొత్స చెప్పారు. అవసరమైతే జగన్ వచ్చి పరిశీలించుకోవచ్చని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఆరు కిలోల బియ్యం, తొమ్మిది గంటల కరెంటు మినహా మిగతా పథకాలన్నీ వందశాతం అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిగురించి మాట్లాడకుండా పిల్లలకు ఫీజులివ్వలేదని, రైతులను పట్టించుకోలేదని బురద జల్లడం మానుకోవాలని బాబు, జగన్‌కు బొత్స  హితవు పలికారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు.

By
en-us Political News

  
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి  చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి  కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ,  కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష  విధించింది.  
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.