శోభా నాగిరెడ్డికి స్పీకర్ నోటీసు
Publish Date:Jan 22, 2012
Advertisement
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదిన ఉదయం 11.30 గంటలకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా స్పీకర్ శోభా నాగి రెడ్డికి ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. విప్ జారీ చేసిన పిఆర్పీ ఎమ్మెల్యే వంగా గీతను కూడా అదే రోజు హాజరు కావాలని నోటీసు పంపారు. అదే విధంగా ఫిబ్రవరి 2వ తేదిన స్పీకరు ఎదుట హాజరు కావాల్సిందిగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి అసెంబ్లీ కార్యరదర్శి రాజా సదారాం నోటీసులు జారీ చేశారు. గతంలో స్పీకరు జారీ చేసిన నోటీసులు తనకు అందనేలేదని ఎమ్మెల్యే కాపు స్పీకరుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. అదే రోజు ప్రభుత్వ విప్ కొండ్రు మురళి స్పీకరు ముందు హాజరై తాము రామచంద్రారెడ్డికి విప్ జారీ చేసినట్లుగా ఆధారాలు చూపనున్నట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/ysr-congress-party-24-11122.html





