విశాఖలో సందడి చేసిన బాలయ్య..చిరు ఫై పోటికి సై
Publish Date:Jan 22, 2012
Advertisement
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత కార్యకర్తలపైనే ఉందని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఏ ప్రాంతం నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని నందమూరి హీరో బాలకృష్ణ మరోసారి చెప్పారు.అయితే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిపై పోటీ చేసేందుకు కూడా సిద్ధమని అయన అన్నరు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ తాను పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు చిత్తశుద్ధితో ముందుకు సాగితేనే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు.
ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రజాధరణ ఉందని చెప్పారు. సినిమాల్లో రాష్ట్ర ప్రజలు తనపై ఎంతగా ఆదరణ చూపారో అదే ఆదరణ రాజకీయాల్లోనూ తనపై ప్రజలు చూపాలని కోరుకుంటున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టిడిపికి పట్టం కట్టడం ఖాయమన్నారు. కాగా బాలయ్య రాక సందర్భంగా విశాఖలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీలో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
మద్యం సిండికేట్లతో సామాన్యులు చితికి పోతున్నారన్నారు. బాక్సైట్ తవ్వకాలు చేస్తే గిరిజనులు ఉనికి కోల్పోతారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్ల గిరిజనులు సంస్కృతి, సాంప్రదాయాలకు దూరమవుతున్నారని బాలయ్య ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఏ పార్టీలో లేని విధంగా చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలు టీడీపీలో ఉన్నారని ఆయన చెప్పారు.పార్టీలో కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు సమన్వయం ఉండాలన్నారు. ఎన్టీఆర్ అభిమానులే పార్టీ కార్యకర్తలయ్యారని గుర్తు చేశారు. తన అభిమానులు సైతం టీడీపీ కార్యకుర్తలుగా మారాలచి ఆయన కోరారు.
http://www.teluguone.com/news/content/tdp-24-11125.html





