బండి సంజయ్ అరెస్ట్.. భగ్గుమన్న బీజేపీ శ్రేణులు

Publish Date:Apr 5, 2023

Advertisement

ఓ వంక టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మరీన నేపథ్యంలో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నడుమ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీం నగర్ ఎంపీ బండి సంజయ్ ను మంగళవారం (మంగళవారం) రాత్రి కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పదోతరగతి ప్రశ్న పత్రాల లీకేజికి బండి సంజయ్ అరెస్టుకు సంబంధం ఉందా లేదా అనే విషయంలో పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నమనేది చెప్పకుండానే పోలీసులు బలవంతంగా ఇంట్లో చొరబడి, ఎంపీని బలవంతగా తీసుకు పోయారని బండి సంజయ్ సతీమణి మీడియాకు తెలిపారు.  

కాగా  బండి సంజయ్ అరెస్టు సందర్భంగా ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  అరెస్టును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు భారీగా మోహరించారు. అదే సమయంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. వారిలో కరీంనగర్‌ అడిషనల్ డీసీపీ చంద్రమోహన్‌, ఏసీపీ  శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు, సీఐలు లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి, నటేష్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో రెండువైపులా తోపులాట  జరిగాయి. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అయినప్పటికీ ఇవన్నీ ముందే ఊహించిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం తమ పనిచేసుకుపోయారు.

బండి సంజయ్‌ని అరెస్టు చేసి.. హైదరాబాద్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌ని తిమ్మాపూర్‌ మీదుగా తరలిస్తుండగా పోలీస్ వెహికిల్‌కి మార్గమధ్యలో రిపేర్ వచ్చింది. పోలీసులు ఆయన్ని మరో బండిలోకి ఎక్కించారు. ఐతే.. బండి సంజయ్‌ని ఎక్కడికి తీసుకెళ్తున్నదీ పోలీసులు.. కుటుంబ సభ్యులకు చెప్పలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. బుధవారం బండి సంజయ్‌ అత్త (సంజయ్‌ భార్య తల్లి) మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో ఆయన కరీంనగర్‌ వచ్చారు. ఆ కార్యక్రమాల్లో ఉండగా.. పోలీసులు బలవంతంగా తీసుకు పోయారని బందువులు ఆరోపిస్తున్నారు. 
కాగా  తన అరెస్టుపై బండి సంజయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.  బీఆర్ఎస్ లో భయం నిజం. మొదట నేను ప్రెస్‌మీట్ పెట్టకుండా నన్ను అడ్డుకున్నారు. తర్వాత నన్ను అర్థరాత్రి అరెస్టు చేశారు. తప్పులు చేస్తోందని దానిపై నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. నన్ను జైలుకు పంపినా.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపను అని బండి సంజయ్ ట్వీట్‌లో తెలిపారు.

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి ఇంటిపై దాడి చేసి ఎంపీని, జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయటం అంటే.. పోలీసులు హద్దు మీరి ప్రవర్తించినట్లే అంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా.. కనీసం 41 నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీస్తున్నారు. ఓ ఎంపీని అరెస్ట్ చేయాలంటే లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇవ్వాలని.. అలాంటిది ఏమీ లేకుండా రాష్ట్ర పోలీసులు వ్యవహరించటం ఏంటని.. దీనిపై కోర్టుల్లో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు బీజేపీ నేతలు. 

ఎంపీగా ఉన్న తనను నోటీసులు కూడా ఇవ్వకుండా.. ముందస్తు సమాచారం లేకుండా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయటంపై.. ఎంపీ బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి వచ్చి పోలీసులు ఏ విధంగా ప్రవర్తించినదీ, తన ప్రశ్నలకు  సమాధానం చెప్పకుండా దురుసుగా లాక్కెళ్లిన తీరును.. ఫొటోలు, వీడియోలతో సహా లోక్ సభ స్పీకర్ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. 
బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ అగ్రనేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ శ్రేణులు మండిపోతున్నాయి. ఆయన ఏమైనా సాధారణమైన వ్యక్తా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. కరీంనగర్ పార్లమెంట్ నుంచి లోక్ సభకు ఎన్నికైన ఎంపీ.. అంతే కాకుండా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు.. అలాంటి వ్యక్తిని కారణాలు చెప్పకుండా అర్థరాత్రి.. ఇంటి మీదకు వచ్చి.. బలవంతంగా అరెస్ట్ చేయటం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

బండి సంజయ్ అరెస్టు విషయంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు బీజేపీ నేతలు. ప్రశ్నాపత్రాల లీకేజీకీ, బండి సంజయ్‌కీ ఏంటి సంబంధం అని నిలదీస్తున్నారు. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో ఓ ఎంపీని అరెస్ట్ చేయటంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనా అర్థరాత్రి సమయంలో బండి సంజయ్‌ని ఇంటికి వచ్చి మరీ బలవంతంగా అరెస్టు చెయ్యడం బీజేపీ వర్గాలను షాక్ కు గురి చేసింది. ఇది ఊహించని పరిణామంగా చెబుతున్నారు. బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా.. ఏప్రిల్ బుధవారం (ఏప్రిల్ 5) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది.

By
en-us Political News

  
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.