రాజ్ దీప్ పై పరవు నష్టం దావా వేస్తారా ?

Publish Date:Apr 5, 2023

Advertisement

ఎవరో అంటే ఏమో అనుకోవచ్చును  కానీ, ఆ మాటన్నది ఎవరో దారిన పోయే దానయ్య,కాదు.. ఇండియా టుడే అంతటి ప్రతిష్టాత్మక టీవీ చానల్ కన్సల్టెంట్ ఎడిటర్ ...  రాజ్‌దీప్ సర్దేశాయ్. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు  కల్వకుట్ల చంద్రశేఖర రావు ఆర్థిక స్థోమత గురించి ఆయన సంచలన విషయం బయట పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దెదించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్   2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటై, ప్రతిపక్ష ఐక్య కూటమి నాయకత్వ పగ్గాలు తన చేతికి అప్పగిస్తే  మరో పార్టీ, మరో అభ్యర్ధి జేబులో చెయ్యి పెట్టవలసిన అవసరం లేకుండా మొత్తం 545 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార వ్యయం మొత్తం తానే ( బీఆర్ఎస్) భరిస్తానని ప్రైవేటు సంభాషణల్లో చెప్పినట్లు రాజ్ దీప్  పబ్లిక్ గా  ప్రకటించారు.  

రాజ్‌దీప్ తన వీక్లీ బ్లాగ్‌లో మోడీ వర్సెస్ ఆల్ అనే అంశం గురించి మాట్లాడారు. అందులో ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడిన రాజ్‌దీప్, 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీకి అన్ని ప్రతిపక్ష పార్టీలకు మధ్య జరుగుతాయా? అనేది చూడాల్సి ఉందన్నారు. ఈ ప్రశ్నకు తన పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఫ్యాక్టర్స్ సమాధానం చెబుతాయని పేర్కొన్నారు.

అదే క్రమంలో ఆయన ప్రాంతీయ పార్టీల నాయకుల ఈగోల గురించి కూడా  ప్రస్తావించారు. ప్రతి నేతా కూడా తనను తాము జాతీయ నేతగానే భావిస్తున్నారని అన్నారు.  కేసీఆర్‌ను తీసుకుంటే.. ఆయన తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు.  మహారాష్ట్రలో బీఆర్ఎస్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేట్ కాన్వర్సేషన్ లోకేసీఆర్.. తన  సహచరులతో ప్రతిపక్షాల కూటమికి తనను చైర్ పర్సన్‌ను చేస్తే 2024 ఎన్నికల ఖర్చు మొత్తం భరించడానికి   సిద్దంగా ఉన్నానని చెప్పాడు. అయితే ఇందుకు ప్రతిపక్షాలలో కేసీఆర్‌కు సమకాలీకులుగా ఉన్న నాయకులు అంగీకరిస్తారా? అని రాజ్‌దీప్ అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రతిపక్షాల కూటమి ఉంటుందా? అనే దానికి సంబంధించి వివిధ అంశాలను ఆ వీడియోలో రాజ్‌దీప్ ప్రస్తావించారు.

అయితే కేసీఆర్ ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, ప్రతిపక్ష పార్టీలు, నాయకులు అంగీకరిస్తారా లేదా చూడవలసి ఉందని  రాజ్‌దీప్  పేర్కొన్నారు. 
అయితే ఇప్పుడు  ఇతర ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ఆఫర్  అంగీకరిస్తాయా? ఆయన్ని కూటమి నేతగా, ప్రధాని అభ్యర్ధిగా అంగీకరిస్తాయా ? అనేది కాదు ప్రశ్న. ఆయనకు ఇంత పెద్ద మొత్తం సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సంధానం చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్  రెడ్డి సహా పలువురు డిమాడ్ చేస్తున్నారు. అదలా ఉంటే రాజ్‌దీప్ చెప్పినదాట్లో నిజం లేకుంటే, ఆయన వివరణ కోరాలి లేదా ఆయన పై పరువు నష్టం దావావేయాలని అంటున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయ రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో కొన్ని విపక్ష పార్టీలతో ఐక్యతను మెయింటెన్ చేస్తున్నారు.  అయితే జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు కేసీఆర్ వ్యుహాలు పక్కాగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటాయి. అయితే తాజగా కేసీఆర్‌కు సంబంధించి సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్‌దేశాయ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.  

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా ఎంతో అత్యాధునిక సౌకర్యాలు, అత్యున్నత భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలకు మారుపేరుగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఒక ఘటన కలకలం రేపింది.
ప్యారడైజ్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. కానీ థియేటర్‌లో సినిమా చూసే ఆడియన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ సిద్ధమైంది.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.