టీపీసీసీ చీఫ్ రేవంత్ రాజీనామా?

Publish Date:Apr 5, 2023

Advertisement

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ తో పొత్తుకు తహతహ లాడుతున్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. కొద్ది రోజుల క్రితం కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తరువాత తాజాగా  సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి కూడా బీజేపీని ఓడించడం కోసం అనే ట్యాగ్ లైన్ యాడ్ చేసి మరీ అవసరం అయితే  కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవచ్చని స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. సరే ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా  కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అధికారికంగా చేతులు కలిపినా కలపక పోయినా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ అనుకూల వర్గం ఉందనేది కాదన లేని నిజం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలో మూడింట రెండు వంతుల (12) మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఒకొంతు మంది (6గురు) మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు.  సో .. కాంగ్రెస్ బీఆర్ఎస్ రక్త సంబంధం గురించి  కొత్తగా మళ్లీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు.    

అదలా ఉంటే గత కొంత కాలంగా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్  వర్గాలలో ఉభయ పార్టీల పొత్తు గురించిన చర్చ జరుగుతూనే వుంది. ముఖ్యంగా పరువు నష్టం కేసులో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించడం, ఆవెంటనే ఆయన లోక్ సభ సభ్యత్వం పై అనర్హత వేటు పడడం చకచకా జరిగిపోయిన  నేపధ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బంధం మరింత బలపడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్  ముఖ్య నేతలు ఇద్దరూ రాహుల్  గాంధీకి ఓపెన్ గా మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాటం చేసేందుకు ఆమోదం తెలిపారు. 

అయితే, బీఆర్ఎస్ తో  కాంగ్రెస్ పొత్తును గట్టిగా వ్యతిరేకిస్తున్న ఒకే ఒక్కడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆయన మంగళవారం (ఏప్రిల్ 4) కాంగ్రెస్, బీఆర్ఎస్  పొత్తుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా ఆ విధమైన  కుట్ర జరుగుతోందనే విషయం చెప్పకనే చెప్పారు. మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ  పొత్తు అనేది జరిగితే అది తన రాజీనామా తర్వాతనేని కుండబద్దలు కొట్టేశారు. అలాగే  తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీలో పొత్తు దిశగా కదలికలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లు అయిందని పరిశీలకులు అంటున్నారు. 

అయితే  అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండదని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదన్నారు. తెలంగాణలో ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.

అయితే రేవంత్ రెడ్డి ఎంత ధీమాగా ఉన్నా రాష్ట్రంలో దేశంలో జరుగతున్న పరిణామాలను గమనిస్తే, రోజులు గడిచే కొద్దీ, బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత అనివార్యం అవుతున్నది. విపక్షాలు  చేతులు కలపడం మినహా మరో మార్గం లేకుండా కేసులు, అరెస్టులతో విపక్షాలను ఒకటిగా కట్టి పడేస్తోంది. ఈనేపధ్యంలో  మాజీ మిత్ర పక్షాల మధ్య  మళ్ళీ పొత్తు పొడవదని చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. అయితే అదే జరిగితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ మాతృ సంస్థ (టీడీపీ) గూటికి చేరడమూ ఖాయమని అంటున్నారు.

By
en-us Political News

  
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
బెంగళూరులోని కుమ్రం భీం కాదండోయ్ పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.