మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు సీఎల్పీ డిమాండ్..!

Publish Date:Aug 21, 2026

Advertisement

 

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది. మంత్రి కొండా సురేఖ  ఆమె కుమార్తె కొండా సుస్మితల వైఖరిపై సొంత పార్టీకి చెందిన శాసనసభ్యులు, మండలి సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ లక్ష్యంగా సుస్మిత చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు.

గాంధీభవన్ వేదికగా జరిగిన అత్యవసర కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) విలేకరుల సమావేశంలో దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, అదే విధంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి డిస్మిస్ చేయాలని అధిష్ఠానాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

కూతురు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి ఇప్పటివరకు ఖండించకపోవడాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య తీవ్రంగా ఆక్షేపించారు. బాధ్యతాయుతమైన కేబినెట్ హోదాలో ఉన్న నాయకురాలు ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదనడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత విషయాలపై ఏదైనా మాట్లాడాలంటే సీఎల్పీ లేదా పీసీసీ సమావేశాల్లో చర్చించాలి తప్ప, బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని స్పష్టం చేశారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ, సురేఖ వ్యవహారశైలిని తీవ్రంగా తప్పుపట్టారు. ఏ చెట్టు కింద ఉండి బతుకుతున్నారో ఆ కొమ్మనే నరికేలా సురేఖ కుటుంబం ప్రవర్తిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమించారని, అటువంటి నాయకత్వాన్నే ప్రశ్నించడం విపక్షాలకు బలాన్నివ్వడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా కుటుంబం వెంటనే సీఎంకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు.

దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ మాట్లాడుతూ, ప్రతిపక్షాల కుట్రలను కొండా కుటుంబం కాంగ్రెస్‌లో ఉంటూనే అమలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వైపు నుంచి ప్రజాపాలన కొనసాగుతుంటే, కొండా సురేఖ మాత్రం ప్రతిపక్ష నేతలా ప్రవర్తించడం సహించరానిదని చెప్పారు. సొంత ప్రభుత్వంపైనే దాడి చేసే నాయకులకు పార్టీలో కొనసాగే హక్కు లేదని తేల్చి చెప్పారు.

పార్టీ ముఖ్య నేతలు, మంత్రుల మధ్య గ్యాప్ రావడం, ప్రత్యేకించి సీఎంను లక్ష్యంగా చేసుకుని విమర్శలు రావడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా కొండా సురేఖ కొన్ని విషయాల్లో నోరుజారి పార్టీని ఇరకాటంలో పడేశారని, ఈసారి మాత్రం అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు సీరియస్‌గా పట్టుబడుతున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పీసీసీ, అధిష్ఠానం పెద్దలు ఈ వివాదాన్ని సర్దుబాటు చేస్తారా లేక ఎమ్మెల్యేల డిమాండ్ మేరకు కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.

Konda Surekha, CM Revanth Reddy, Telangana Congress, CLP Press Meet, Telangana Politics, TPCC President Mahesh Kumar Goud, MLA Vemula Veeresham

By
en-us Political News

  
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. !
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు 11 21, 21 15, 17 21తో వాంగ్ జి యి చేతిలో ఓడిపోగా, సాత్విక్ చిరాగ్ మరియు ట్రీసా గాయత్రి జోడీలు సంచలన విజయాలతో క్వార్టర్స్‌లోకి ప్రవేశించాయి. తదుపరి మ్యాచ్ వివరాలు ఇవే
ఏఎఫ్సీ విమెన్స్‌‌ చాంపియన్స్ లీగ్‌లో ఈస్ట్‌‌ బెంగాల్‌‌ ఎఫ్‌‌సీ 12 0 తేడాతో రోవర్స్‌‌ ఎఫ్‌‌సీపై చారిత్రాత్మక విజయం సాధించింది. 40 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ ఆసియా పోటీల్లో ఇండియన్ క్లబ్ సాధించిన అతిపెద్ద విజయం ఇదే!
మేటా స్మార్ట్ గ్లాసెస్‌పై UK సినిమా థియేటర్లలో నిషేధం విధించే ఆలోచన మొదలైంది. ప్రైవసీ ఆందోళనలతో పాటు రహస్యంగా సినిమాలు రికార్డు చేసి పైరసీ చేసే ప్రమాదం ఉండటంతో ఈ సంచలన నిర్ణయం వైపు అడుగులు పడుతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
ది బిగ్ బ్యాంగ్ థియరీ పాపులర్ స్పిన్ ఆఫ్ సిరీస్ స్టువర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ సీజన్ 2 పై క్రియేటర్స్ చక్ లోరే, జాక్ పెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షో భవిష్యత్తు ప్రణాళికలు మరియు HBO Max నిర్ణయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.