అవును.. ఆ ఇద్దరరూ మళ్ళీ ఒకటయ్యారు!

Publish Date:Apr 12, 2025

Advertisement

భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో పట్టుకోసం చేసే ప్రయత్నాలు రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగానే సాగుతున్నాయి.  అందుకే నాలుగు పదులకు పైబడిన ప్రస్థానంలో కేంద్రంలో వరసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చినా, తమిళనాడులో  మాత్రం, ఒకటీ అరా సీట్లే కానీ  అంతకు మించి మరో అడుగు వేయ లేక పోతోంది.  అందుకే పొత్తుల ప్రయాణానికే  ప్రాధాన్యత ఇస్తోంది. ఇదే క్రమంలో ఇప్పడు మరో మారు.. అన్నాడీఎంకేతో  పొత్తుకు బీజేపీ పచ్చజెండా ఊపింది.

భారతీయ జనతా పార్టీ మరో పాత మిత్రపక్షంతో, మరో మారు జట్టు కట్టింది. లోక్ సభ, రాష్ట అసెంబ్లీ ఎన్నికలకు ముందుఆంధ్ర ప్రదేశ్ లోమాజీ మిత్ర పక్షాలు తెలుగు దేశం,జనసేనతో, పొత్తు పెట్టుకుని  ప్రయోజనం పొందిన బీజేపీ ఇప్పడు ఏపీ పొరుగు రాష్ట్రం తమిళనాడులోనూ మాజీ మిత్ర పక్షం అన్నాడీఎంకేతో  మరోమారు చేతులు కలిపింది. మరో మారు పొత్తు పెట్టుకుంది. కాగా  రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, శుక్రవారం (ఏప్రిల్12) చెన్నైలో పొత్తు ప్రకటన చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకతించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పళనిస్వామి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.పళని స్వామి, అన్నాదురైతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా ఈసారి కుదిరిన పొత్తు పదికాలాల పాటు పటిష్టంగా ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అలాగే అవినీతి కుంభకోణాల పుట్టగా మారిన డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అమిత్ షా విశ్వాసం వ్యక్త పరిచారు. 

నిజానికి ఉభయ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. గత నెలలో అన్నాడీఎంకే నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అప్పటి నుంచి పొత్తు సంబందిదించిన చర్చలు సాగుతూనే ఉన్నాయి. అయితే  అదే సమయంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అన్నాడీఎంకేతో  పొత్తుకు అంత  సుముఖంగా లేరనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఈ నేపధ్యంలో పొత్తుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అన్నామలై  బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేయడంతోపాటుగా  పొత్తుకు స్వాగతం పలికారు. డిఎంకే అరాచక పాలనను అంతమొందించేందుకు బీజేపీ,అన్నాడీఎంకే పొత్తు సరైన అస్త్రం అవుతుందని అన్నామలై ప్రకటించారు. అలాగే  బీజేపీ రాష్ట్ర  అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పు కున్నారు. దీంతో పొత్తు ప్రక్రియ అనుకున్నట్లుగా జరిగిపోయింది. మరోవంక  అన్నామలై స్థానంలో తమిళనాడులో కొత్త బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్‌ను నియమించిన రోజే పొత్తులపై ప్రకటన రావడం విశేషంగా పేర్కొంటున్నారు.  కాగా  234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్   నెలల్లో  ఎన్నికలు జరుగనున్నాయి. 

తమిళనాడులో ఏఐఏడీఎంకే,  బీజేపీ పొత్తులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1998 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని పార్టీ బీజేపీతో జతకట్టి రాష్ట్రంలోని 39 సీట్లలో 30 సీట్లను గెలుచుకుంది. అయితే, తర్వాతి సంవత్సరమే ఏఐఏడీఎంకే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది.  2004 లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి మారిపోయింది. ఏఐఏడీఎంకే కేవలం ఒక సీటును గెలుచుకోగా, బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కేంద్రంలో ఎన్డీయే పాలన ముగియడంతో యూపీఏ తిరిగి అధికారంలోకి వచ్చింది. జయలలిత శకం తర్వాత, అన్నాఏడీఎంకే 2021 రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి కేవలం 75 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2023లో ఈ కూటమి ముక్కలైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే, బీజేపీ విడిగా పోటీ చేసినా ఒక్కటీ గెలువలేకపోయాయి. డీఎంకే 39 సీట్లను కైవసం చేసుకుంది.

ఈ నేపధ్యంలో కలిసి ఉంటె కలదు జయం అనే నిజాన్ని కొంచెం అస్యంగానే అయినా అర్థం చేసుకున్న ఉభయ పార్టీల మళ్ళీ పొత్తు బంధంతో ఒకటయ్యాయి. అయితే.. పొత్తు కుదిరినంత మాత్రాన  అంతా అయినట్లు కాదనీ, ముఖ్యంగా పళని స్వామి, అనామలై మధ్య ఉన్న సంబంధాలపైనే పొత్తు ఫలితం ఆధార పడి ఉంటుందని అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.