రాజ్యసభ సభ్యుల్లో బిలియనీర్లు.. టాప్ ఎవరో తెలుసా?

Publish Date:Jun 25, 2026

Advertisement

రాజ్యసభలో ప్రజాప్రతినిధుల ఆస్తుల వివరాలను   అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక తాజాగా విడుదల చేసింది.  రాజ్యసభ సభ్యులలో  అత్యధికులు కుబేరులేనని ఆ నివేదిక పేర్కొంది.   మొత్తం 233 మంది రాజ్యసభ సభ్యులకు గాను, 226 మంది ఎంపీలు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ   నివేదికను రూపొందించింది. 

ఈ నివేదిక మేరకు.. 226 మంది ప్రజాప్రతినిధుల మొత్తం ఆస్తుల విలువ అక్షరాలా  26 వేల 47 కోట్ల రూపాయలుగా తేలింది. దీని ప్రకారం లెక్కగడితే, సభలోని ఒక్కో రాజ్యసభ ఎంపీ సగటు ఆస్తి విలువ  15 కోట్లకు పైమాటే.   మొత్తం సభ్యులలో 31 మంది ఎంపీలు అంటే దాదాపు 14 శాతం మంది ప్రజాప్రతినిధులు  100 కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తుల ఉన్నవారే.  అలాగే దాదాసే  100 మంది ఎంపీల ఆస్తుల విలువ  10 కోట్లకు పైగా ఉండగా.. 41 మందికి .5 కోట్ల నుంచి  0 కోట్ల మధ్య,   66 మంది సభ్యులకు  1 కోటి నుండి రూ.5 కోట్ల మధ్య స్థిర, చర ఆస్తులు ఉన్నాయి. దీనికి భిన్నంగా కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే తమ మొత్తం ఆస్తి రూ.20 లక్షల లోపు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ ద్వారా తేలిందని ఏడీఆర్ నివేదిక బయటపెట్టింది. 

 రాజ్యసభ సభ్యుల కుబేరుల జాబితాలో  అగ్రస్థానంలో.. బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి రూ.5,300 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ సభ్యుడిగా నిలిచారు.   ఇక ఈ నివేదికలో   69 మంది ఎంపీలపై  వివిధ క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొంది. వీరిలో 36 మంది సభ్యులు ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉన్న అత్యంత తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారని వివరించింది. వీరిలో..  ఒక ఎంపీపై ఏకంగా హత్య కేసు, మరో నలుగురిపై హత్యాప్రయత్నం కేసులు ఉన్నాయి.  నలుగురు ఎంపీలపై మహిళలపై దాడులు, నేరాలకు సంబంధించిన   కేసులు ఉన్నాయి.కాగా తెలుగు రాష్ట్రాలలో  తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎంపీలలో ముగ్గురిపై,  బీఆర్ఎస్  కి చెందిన ముగ్గురు ఎంపీలపై కేసులు ఉన్నాయి.  

By
en-us Political News

  
. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో చేపడుతున్న విభిన్న కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించిన ప్రపంచ బ్యాంకు బృందం.. ఇక్కడి విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్నారుల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచడం, సంఖ్యాజ్ఞాన నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల ( యూఎల్ బీ) పరిధిలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసి, దానిని తిరిగి ఉత్పాదక రంగాల్లో వినియోగించడమే లక్ష్యంగా మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణంగా నదుల్లోకి, సముద్రాల్లోకి వదిలేసే వ్యర్థ జలాలను రీసైక్లింగ్ చేసి, వాటిని వివిధ అవసరాలకు మళ్లించనున్నారు.
మహేశ్ దీక్షిత్ కు దేశ రక్షణ వ్యూహాలను రచించడంలో  దశాబ్దాల  అనుభవం ఉంది. 1993 బ్యాచ్‌కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన మహేశ్ దీక్షిత్ తన  కెరీర్‌లో ఎక్కువ భాగం ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే పని చేశారు.
ఈ ప్రక్రియకు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. ఇందుకు సంబంధించిన సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ ఆమోదించింది. దీంతో త్వరలోనే ఈ 42 మంది అధికారులు ఉన్నత హోదాలలో బాధ్యతలు చేపట్టనున్నారు.
గతంలో ఆర్కాటు నవాబు భార్య తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఈ పవిత్ర దర్గాను దర్శించుకున్న తర్వాత ఆమె పూర్తిగా కోలుకున్నారని, అందుకు కృతజ్ఞతగా నవాబు దంపతులు స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు రొట్టెలను పంపిణీ చేశారు. నాటి నుంచి ప్రారంభమైన ఈ రొట్టెల మార్పిడి సంప్రదాయం ఒక పవిత్ర ఆచారంగా ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న విగ్రహ నమూనా పోస్టర్‌ను ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన అపారమైన నమ్మకాన్ని, 56 శాతం భారీ ఓట్ల శాతాన్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విఫలమవుతోందని సువేరా విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఏమిటంటే, గెలుపే పరమావధిగా భావించి ఎలాంటి క్రెడిబిలిటీ లేని వ్యక్తులకు, గాలివాటంగా వచ్చిన నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడమేనని ఆయన విశ్లేషించారు.
బ్జాదారులు ఆ భూమిలో రెండు తాత్కాలిక షెడ్లు నిర్మించడంతో పాటు ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా మొత్తం 5 ఎకరాల భూమి చుట్టూ రేకుల షీట్లతో ప్రహరీ పనులు చేపట్టారు.
నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని, క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
వెనిజులా రాజధాని కారకాస్‌లో 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు సృష్టించిన విధ్వంసం, మృతుల వివరాలు మరియు తాజా పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం.
గతంలో చట్ట సభల్లో ప్రజా సంక్షేమం, విధానాల రూపకల్పనపై ఆదర్శవంతమైన చర్చలకు నిలయంగా ఉండేవన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు అవి వ్యక్తిగత దూషణలకు నిలయాలుగా మారాయన్నారు. సిద్ధాంతాల ప్రాతిపదికన సాగాల్సిన విమర్శలు, వ్యక్తిగత పగలు, ద్వేషాలను వెళ్లగక్కేలా మారిపోయాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటం కంటే ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే నేటి నాయకులకు ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ Oracle ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు ఆటోమేషన్ కారణంగా భారతీయ ఐటీ రంగం, ఫ్రెషర్స్ మరియు మిడ్లె వల్ మేనేజర్లపై పడనున్న ప్రభావం, మరియు మీ కెరీర్ కాపాడుకోవడానికి అవసరమైన టాప్ AI స్కిల్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఒక క్రైమ్ సినిమాను తలపించేలా సాగిన ఈ ఘోర హత్యోదంతంలో రోజుకో సంచలన వాస్తవం వెలుగులోకి వస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.