మురుగునీటి పునర్వినియోగ విధానానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. జల భద్రత దిశగా కీలక ముందడుగు

Publish Date:Jun 25, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జల భద్రతకు కొత్త పాలసీని అమలులోకి తీసుకు వచ్చింది.  భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా ఈ విధానాన్ని తీసుకువచ్చింది.  స్వర్ణాంధ్ర విజన్-2047 పది సూత్రాల ప్రణాళికలో భాగంగా జల భద్రతకు   ప్రాధాన్యత ఇస్తూ  శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగ పాలసీకి ఆమోదం ముద్ర వేసింది. సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహిస్తూ, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఈ నిర్ణయం  మైలురాయిగా నిలవనుంది.

ఈ నూతన విధానం ద్వారా రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల ( యూఎల్ బీ) పరిధిలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసి, దానిని తిరిగి ఉత్పాదక రంగాల్లో వినియోగించడమే లక్ష్యంగా మార్గదర్శకాలను జారీ చేసింది. సాధారణంగా నదుల్లోకి, సముద్రాల్లోకి వదిలేసే వ్యర్థ జలాలను  రీసైక్లింగ్ చేసి, వాటిని వివిధ అవసరాలకు మళ్లించనున్నారు.   పారిశ్రామిక,  పౌర వ్యర్థ జలాల పునర్వినియోగం వల్ల సహజ నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే..  భూగర్భ జలాలు అడుగంటిపోకుండా కాపాడుకోవడానికి  దోహదపడుతుంది.

ఈ విధానం కింద శుద్ధి చేసిన నీటిని ప్రధానంగా పెద్ద ఎత్తున నిర్మాణ రంగ పనులకు, ల్యాండ్‌స్కేపింగ్, పురపాలక సేవలు, పబ్లిక్ పార్కులు,  తోటల పెంపకానికి ఉపయోగించనున్నారు. అలాగే నగరాల్లో రోడ్లను శుభ్రం చేయడానికి, అగ్నిమాపక సేవల  అవసరాలకు, రైల్వే యార్డులు, అలాగే బస్ డిపోలలో వాహనాల క్లీనింగ్ కోసం ఈ శుద్ధి చేసిన నీటిని  మాత్రమే వాడేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు ఓడరేవులు, భారీ వాణిజ్య సంస్థలు..ఇలా ఎక్కడైతే  అనువుగా ఉంటుందో అక్కడ ఈ జలాలను వినియోగంలోకి తీసుకురానున్నారు. వాషింగ్ సౌకర్యాలు ఎక్కువగా ఉండే వాణిజ్య యూనిట్లకు కూడా ఈ నీటిని సరఫరా చేస్తారు.

ఈ ప్రణాళికను క్షేత్రస్థాయిలో   సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం   కచ్చితమైన నిబంధనలను విధించింది. శుద్ధి కేంద్రాల నుండి 5 కిలోమీటర్ల పరిధిలో జరిగే అన్ని రకాల నిర్మాణ కార్యక్రమాలు,  అలాగే 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైల్వే యార్డులు, బస్ డిపోలు, పోర్టులు వంటి భారీ వినియోగదారుల పరిధిలోకి ఈ నీటి సరఫరాను వర్తింపజేశారు. ఈ నిర్దేశిత పరిధిలో ఉన్న పరిశ్రమలు, సంస్థలు కచ్చితంగా శుద్ధి చేసిన మురుగునీటినే వాడాల్సి ఉంటుంది. దీనివల్ల తాగు నీటిని పారిశ్రామిక అవసరాలకు మళ్లించే పరిస్థితి ఉండదు. 

పట్టణాల్లో మౌలిక సదుపాయాల ఆధునీకరణలో భాగంగా  డ్యూయల్ పైపింగ్ వ్యవస్థ  ను ప్రభుత్వం ఐచ్ఛికం నుంచి తప్పనిసరి చేయనుంది. నోటిఫైడ్ ప్రాంతాలలో నిర్మించే గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాలు,  సంస్థాగత భవనాలలో ప్రణాళికాబద్ధంగా ఈ డ్యూయల్ పైపింగ్ లైన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక పైపు ద్వారా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయితే, రెండవ పైపు లైన్ ద్వారా ఫ్లషింగ్, గార్డెనింగ్ వంటి ఇతర అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీరు అందుతుంది. ఈ వినూత్న జల నిర్వహణ విధానం ఆంధ్రప్రదేశ్‌ను జల సమృద్ధి గల రాష్ట్రంగా మార్చడమే కాకుండా, రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

By
en-us Political News

  
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి సస్పెండ్..!
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది.
విచారణ కమిటీ నివేదిక వేళ ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యకు యత్నం..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు మరో కీలక దశకు చేరుకుంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది.
ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో శాసించిన లెజెండరీ ఆటగాడు లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్ తీవ్ర నిరాశతో ముగిసింది.
నేటి సోషల్ మీడియా యుగంలో క్షణాల్లోనే ఫేమస్ కావాలనే మోజు యువతను ప్రమాదకర మార్గాల వైపు నెడుతోంది.
ప్రపంచ ఫుట్‌బాల్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో స్పెయిన్ జట్టు సంచలన విజయంతో విశ్వవిజేతగా నిలిచింది
కానిస్టేబుల్ నుండి ఐపీఎస్‌..అయిన తీరు మారలేదు..!
రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన స్పెయిన్..!
సిదిరి అప్పలరాజు కుమారుడు .. ఆరవ్ వర్మ కు కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్సై సునీల్ కూడా అండగా నిలిచారని వెల్లడైంది. అరవ్ హిట్ అండ్ రన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడింది.
సాధారణంగా దూకుడుగా ఆడే రోహిత్, ఈ మ్యాచ్‌లో ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఒకింత నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. లూజ్ బాల్ వచ్చే వరకూ వెయిట్ చేశాడు. స్టాల్ సెలక్షన్ కూడా సెలక్టివ్ గా ఉంది. లూజ్ బాల్స్ ను బౌండరీకి తరలిస్తూ.. మంచి బంతులకు గౌరవం ఇస్తూ ఇన్నింగ్స్ నిర్మించాడు.
అలల తాకిడికి వారిలో ముగ్గురు సముద్రంలో మునిగి మరణించారు. మృతులను 23 ఏళ్ల అరవింద్, 17 ఏళ్ల శ్రీరామ్, సాయిగా గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం సాయంత్రం వేళ సముద్రంలో అలల ఉద్ధృతి అకస్మాత్తుగా పెరిగిపోయింది. చూస్తుండగానే సముద్రం ఉగ్రరూపం దాల్చింది. భారీ అలల తాకిడికి ఈ ముగ్గురు యువకులు సముద్రంలో కొట్టుకుపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.