బర్తడే పార్టీని రద్దు చేయించి మరీ.. కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన నిజాలు

Publish Date:Jun 25, 2026

Advertisement

పుణేకి చెందిన  యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. మొదట లోహగడ్ కోట సమీపంలో లోయలో పడి జరిగిన ప్రమాదంగా భావించిన ఈ ఘటన.. పోలీసుల  దర్యాప్తులో అత్యంత దారుణ హత్యగా తేలింది. కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి పక్కా ప్రణాళిక ప్రకారమే కేతన్‌  ప్రాణాలు తీసిందని దర్యాప్తు తేల్చింది. ఒక క్రైమ్ సినిమాను  తలపించేలా సాగిన ఈ ఘోర హత్యోదంతంలో రోజుకో సంచలన వాస్తవం  వెలుగులోకి వస్తున్నది. వివరాల్లోకి వెడితే.. కేతన్ అగర్వాల్‌కు, సియా గోయల్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే   నిశ్చితార్థం జరిగింది.  నవంబర్ లో వీరిద్దరికీ వివాహం జరిపించేందుకు   ముహూర్తం నిర్ణయించారు. అయితే.. సియా గోయల్‌కు అంతకుముందే వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. బేకరీ నడుపుకునే సియాకు, డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేసే చేతన్ చౌదరితో ప్రేమ బంధం ఉంది.  ఈ క్రమంలోనే   కేతన్‌తో పెళ్లి నిశ్చయించడంతో, తమ ప్రేమ బంధానికి అతడు అడ్డుగా మారుతాడని సియా భావించి  కేతన్‌ను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడు చేతన్‌తో కలిసి పథకం రచించింది.

కాగా  నిందితురాలు సియా గోయల్ పుట్టినరోజు జూన్ 20న వైభవంగా నిర్వహించడానికి కేతన్ కుటుంబం భారీ ఏర్పాట్లు చేసింది. కాబోయే కోడలిపై ఉన్న ప్రేమతో కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన మహాబలేశ్వర్‌లోని ఒక లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఏకంగా 70 గదులను ముందుగా బుక్ చేశారు. ఇరు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా బర్త్‌డే వేడుకలు జరపాలని నిర్ణయించారు. అయితే ఈ వేడుకల వల్ల తమ  ప్లాన్‌కు ఆటంకం కలుగుతుందని భావించిన సియా గోయల్, చాలా తెలివిగా మహాబలేశ్వర్ పర్యటనను రద్దు చేసుకునేలా కేతన్‌ను ఒప్పించింది.

దానికి బదులుగా జూన్ 18న పుణే పరిసరాల్లోని లోహగడ్ కోట సందర్శనకు ప్లాన్ చేసింది.  అక్కడ కేతన్ ను హత్య చేయడానికి ప్రియుడితో కలిసి ప్రణాళిక రచించి అమలు చేసింది. వాస్తవానికి..  కేతన్‌ను ఖతం చేయడానికి అంతకుముందు నాలుగు సార్లు వీరు విఫలయత్నాలు చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు.  జూన్ 18వ తేదీన లోహగడ్ కోట వద్ద చేసిన ఐదో ప్రయత్నం పలిచింది. ఒకవేళ ఆ రోజు   ప్లాన్ ఫెయిల్ అయితే అమలు చేయడానికి 'ప్లాన్ సి' ని కూడా సిద్ధంగా ఉంచుకున్నట్లు పోలీసు విచారణలో వీరు అంగీకరించారు. జూన్ 18న కోటపై ట్రెకింగ్ చేస్తూ..  కాబోయే భార్యను ఫోటోలు తీస్తున్న సమయంలో ఈదురు గాలుల వల్ల కాలుజారి లోయలో పడిపోయాడంటూ సియా గోయల్ మొదట కట్టుకథలు అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.

అయితే ఈ కేసులో పోలీసులకు లభించిన లూప్‌హోల్స్ నేరస్థులను  బుక్ చేశాయి. ప్రమాదం జరిగిన రోజున లోహగడ్ కోట పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులకు  ఆ రోజు తీవ్రమైన ఎండ, సుమారు 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంతటి మండుటెండలో కూడా ఒక వ్యక్తి ఒంటి నిండా హుడీ ధరించి, తలపై క్యాప్ పెట్టుకుని, ముఖం కనిపించకుండా హెడ్‌సెట్ తగిలించుకుని తిరగడం పోలీసులకు అనుమానం కలిపించింది. ఆ ఫుటేజీలో కేతన్, సియా నడుస్తుండగా.. వారికి కేవలం 20 నుండి 30 అడుగుల దూరంలోనే ఈ హుడీ ధరించిన వ్యక్తి వారిని అనుసరిస్తూ కనిపించాడు.

అలాగే.. సియా గోయల్ నడుస్తూ అకస్మాత్తుగా వెనక్కి తిరిగి చూడటం, ఆమె చూడగానే ఆ హుడీ వ్యక్తి అక్కడే కింద కూర్చోవడం   రికార్డైంది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ జరపగా..  ఆ హుడీ ధరించిన  సియా ప్రియుడు చేతన్ చౌధరి అని తేలింది. కోటపై జనసంచారం తక్కువగా ఉన్న సమయం చూసి, ఇద్దరూ కలిసి కేతన్‌ను బలవంతంగా లోయలోకి తోసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వారు అంగీకరించారు.   

By
en-us Political News

  
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.